Tabu: చెన్నకేశవరెడ్డి సినిమాలో టబు పాత్రలో ఆ హీరోయిన్ తోలి ప్రాధాన్యత అంట!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అగ్ర హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీపడుతూ వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికి బాలకృష్ణ దాదాపు 108 సినిమాలు తీశారు. ఇలాంటి ఒక స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వస్తే చాలు అని ఎదురు చూసి ఎంతోమంది హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పాలి.

ఇలా బాలయ్యతో సినిమా చేసే అవకాశం కోసం కొంతమంది సినీ తారలు ఎదురుచూస్తూ ఉండగా సినీనటి రమ్యకృష్ణ మాత్రం బాలయ్యతో నటించే అవకాశం వచ్చిన తాను నటించనని బాలకృష్ణ మొహం మీదే చెప్పేసారట. బాలకృష్ణ వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు.

ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రి కొడుకుల పాత్రలో నటించారు. తండ్రి పాత్రలో ఉన్న బాలకృష్ణకు జోడిగా హీరోయిన్ టబు నటించగా కొడుకు పాత్రలో బాలకృష్ణకు శ్రియ హీరోయిన్ గా నటించారు. అయితే తండ్రి పాత్రలో బాలకృష్ణకు జోడిగా నటించే అవకాశం ముందుగా నటి రమ్యకృష్ణకే వచ్చిందట. ఇదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావించడంతో అందుకు రమ్యకృష్ణ ఒప్పుకోలేదని తెలుస్తుంది.అప్పటికే ఆమె సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ (Tabu) హీరోయిన్ గా కొనసాగుతూ ఉన్న సమయంలో హీరోకి తల్లి పాత్రలో నటిస్తే తన కెరియర్ పై తీవ్రమైన ప్రభావం పడుతుందన్న కారణంతోనే రమ్యకృష్ణ బాలకృష్ణతో కలిసి తాను చేయనని కరాకండిగా చెప్పేసారట.ఇలా రమ్యకృష్ణ చేయనని చెప్పడంతోనే రమ్యకృష్ణ స్థానంలో నటి టబును తీసుకున్నారు. ఇక ఈ సినిమా విడుదల అయ్యి అప్పట్లో సంచలనాలను సృష్టించిన విషయం మనకు తెలిసిందే.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus