స్పెషల్ సాంగ్ కోసం భారీ పారితోషికం తీసుకొన్న తమన్నా!

హీరోయిన్స్ రెమ్యూనరేషన్ స్టాక్ మార్కెట్స్ కంటే దారుణంగా ఉంటాయి. ఎప్పుడు హైక్ అవుతాయో.. ఎప్పుడు డౌన్ అవుతాయి అనేది ఎవ్వరూ ఊహించలేదు. ఒక సినిమాకి 20 లక్షలు తీసుకున్న హీరోయిన్ నెక్స్ట్ సినిమాకే కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఒక్కోసారైతే.. తాము హీరోయిన్లుగా నటించే సినిమాలకంటే స్పెషల్ సాంగ్స్ లేదా ఐటెమ్ సాంగ్స్ కోసం తీసుకొనే రెమ్యూనరేషన్ ఎక్కువ ఉంటుంది.

ప్రస్తుతం తమన్నాకి ఉన్న క్రేజ్ ను బట్టి ఒక సినిమాకి మహా అయితే కోటి రూపాయల దాకా రెమ్యూనరేషన్ ఇస్తున్నాయి. ఒకవేళ బైలింగువల్ మూవీ అయితే షూటింగ్ డేస్ ఎక్కువ కాబట్టి.. అమ్మడి మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని కోటిన్నర దాకా ఇవ్వొచ్చు. కానీ.. తమన్నా “సవ్యసాచి”లో నాగచైతన్యతో “నిన్ను రోడ్డు మీద చూసినాది” రీమిక్స్ సాంగ్ లో డ్యాన్స్ చేయడానికి ఏకంగా 75 లక్షల రూపాయల పారితోషికాన్ని అందుకొందట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ లో విడుదలవుతుంది. మరీ 75 లక్షలు రెమ్యూనరేషన్ గా ఇస్తే.. ఇక ఆ సాంగ్ పిక్చరైజేషన్ కోసం ఇంకెంత ఖర్చుపెట్టి ఉంటారు అనేది ఫిలిమ్ నగర్ లో చర్చనీయాంశం అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus