Tamanna : బంధం, కెరీర్ కు చాలా ప్రమాదకరం అంటున్న మిల్కీ బ్యూటీ !
- January 27, 2026 / 04:45 PM ISTByFilmy Focus Desk
మిల్కీ బ్యూటీ అంటే టక్కున గుర్తొచ్చే భామ తమన్నా భాటియా. తనకు మాత్రమే సొంతమైన మిల్కీ వైట్ అందంతో పాటు తన మార్క్ నటన మరియు డాన్సులతో సినీ ప్రేక్షకుల అభిమానుల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకుంది ఈ భామ. అయితే చాలా కాలం వరకు తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడు బయటపెట్టని తమన్నా, తన రిలేషన్ షిప్ గురించి ఓపెన్ గా తెలియజేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది బ్యూటీ. అయితే తాజాగా తన రిలేషన్షిప్స్ గురించి ‘ప్రమాదకరం’ అంటూ తమన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
Tamanna
ఆ మధ్య బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్షిప్ లో ఉన్న విషయం బోల్డ్ గా బహిర్గత పరిచి, ఆయనతో బంధాన్ని కన్ఫర్మ్ చేసిన తమన్నా. ఆ తరువాత కొంత కాలం విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో విహరించటం అందరికి తెల్సిన విషయమే. అయితే, ఆ తరువాత వారిద్దరి మధ్య విభేదాలు రావటం & పరస్పరంగా ఇరువురు ఆ బంధాన్ని బ్రేక్ చేసుకోవటం కూడా జరిగింది. అప్పట్లో ఆ సంగతి పై పెద్దగా స్పందించని తమన్నా, తాజాగా బంధాలపై మాట్లాడుతూ ” తాను కెరీర్ కోసం ఒక వ్యక్తిని, అలాగే ప్రవర్తన నచ్చక మరొక వ్యక్తికి బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా, బంధంలో ఉండటం తన కెరీర్ కు మాత్రమే కాక, తన క్యారక్టర్ కే ప్రమాదకరమని చెప్పుకొచ్చారు. ఇవి గ్రహించాకే ఆ విషపూరిత బంధాల నుంచి బయటపడ్డానని తెలియజేసింది.














