Tamanna: తమన్నా హాట్‌ సాంగ్‌.. యమా హాట్‌ మూమెంట్స్‌… ఇప్పుడు యూట్యూబ్‌లో…!

‘జైలర్‌’ సినిమా విడుదలయ్యాక.. అందులో రజనీకాంత్‌ విశ్వరూపం చూసి, ఆ తర్వాత వసూళ్ల సునామీ చూసి, దేశవ్యాప్తంగా రెస్పాన్స్‌ చూసి అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు కానీ… అంతకుముందు ఈ సినిమాకు ఎవరూ ఊహించని ప్రచారం ఇచ్చింది మాత్రం తమన్నానే. సినిమా టీజర్‌లో, ట్రైలర్‌లో ఆమె కనిపించింది లేదు.. ఆమె ఎలా ప్రచారం చేసింది అనుకుంటున్నారా? ఇంకెలా ‘కావాలయ్యా..’ పాటతోని. ఆ పాటలో తమన్నా హాట్‌ మూవ్స్‌ సినిమాకు మాంచి బజ్‌ను తీసుకొచ్చాయి.

ఆ తర్వాత సినిమా వచ్చాక ఆ పాటను వెండితెరపై చూసి కుర్రకారు వావ్‌ అనుకున్నారు. తనకు మాత్రమే సాధ్యమైన మూమెంట్స్‌తో వావ్‌ అనిపించింది. దీంతో ఆ పాట మాకు ‘కావాలయ్యా..’ అంటూ కుర్రకారు తెగ రీల్స్‌, షార్ట్స్‌ చేసేశారు. ఇప్పుడు అంతటి వైరల్‌ సాంగ్‌ ఫుల్‌ వెర్షన్‌ యూట్యూబ్‌లో వచ్చేసింది. సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అక్కడ యూట్యూబ్‌లో కూడా దుమ్ముదులపాలని పాటను తీసుకొచ్చినట్లు అర్థమవుతోంది. రజనీకాంత్ ప్రధాన పాత్రలో, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జైలర్’.

బాక్సాఫీసు దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా సుమారు రూ. 600 కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఇక ‘కావాలయ్యా…’ పాటకు అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన విషయం తెలిసిందే. సింధూజ శ్రీనివాసన్ ఆలపించిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట లిరికల్‌ సాంగ్‌ సుమారు రెండు నెలల క్రితం యూట్యూబ్‌లో వచ్చింది. తమిళ వెర్సన్‌కు 17 కోట్లకుపైగా వ్యూస్‌ రాగా, తెలుగు వెర్షన్‌ రెండు కోట్లకుపైగా వచ్చాయి. మరిప్పుడు ఫుల్‌ సాంగ్‌ ఎన్ని వ్యూస్‌ తెచ్చుకుంటుందో చూడాలి.

‘జైలర్’ సినిమాను సన్ పిక్చర్స్ కళానిధి మారన్ నిర్మించారు. ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా విజయం అందుకోవడంతో ఆ ఆనందాన్ని అదనపు మొత్తం రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారు నిర్మాత. దానికితోడు కాస్ట్‌లీ కార్లు కూడా గిఫ్ట్‌లుగా ఇస్తున్నారు. రజనీకాంత్‌, నెల్సన్‌ దిలప్‌ కుమార్‌, అనిరుథ్‌ లాంటి వాళ్లు ఇప్పటికే ఆ గిఫ్ట్‌లు అందుకున్నారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus