Tamanna: ఫ్యాన్స్ తో కలిసి తమన్నా మాస్ స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో..!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మంచు మనోజ్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. అటు తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీడేస్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుని వరుసగా తమిళంలో రూపొందే క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అవి సక్సెస్ అవ్వడంతో తెలుగులో కూడా ఈమెకు పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి.

‘బద్రీనాథ్’ ‘రచ్చ’ ‘ఊసరవెల్లి’ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ‘ఆగడు’ వంటి బడా హీరోల సినిమాల్లో ఈమె నటించింది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో సీనియర్ స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ ఏడాది వెంకటేష్ కు జోడీగా ‘ఎఫ్3 ‘ లో కనిపించిన తమన్నా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె అభిమానులతో కలిసి స్టెప్పులేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గురువారం నాడు చెన్నై నగరంలో జరిగిన ‘మెటా క్రియేటర్‌ ఈవెంట్‌’కు తమన్నా హాజరయ్యింది. రెడ్‌ డ్రెస్‌లో ఈమె చాల అందంగా కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఆమె అభిమానుల కోరిక మేరకు మాస్టర్‌ సినిమాలోని ‘వాతి కమింగ్’ పాటకు డ్యాన్స్‌ చేసి అలరించింది.అభిమానులతో కలిసి డ్యాన్స్‌ ఫ్లోర్‌ను ఆమె స్టెప్పులతో ఊపేసింది తమన్నా. లేట్ చేయకుండా ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus