పెళ్లి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న తమన్నా!

శ్రీ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన తమన్నా అప్పటినుంచి ఇప్పటివరకు కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పటికీ తెలుగులో తమన్నా చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు ఉన్నాయి. ఇతర భాషల సినిమాల్లో కూడా తమన్నా నటిస్తున్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన స్థాయిలో తమన్నాకు మరే ఇండస్ట్రీలో గుర్తింపు రాలేదనే సంగతి తెలిసిందే. అయితే గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో తమన్నా పెళ్లికి సంబంధించిన వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.

త్వరలో తమన్నా పెళ్లి జరగబోతుందని ప్రముఖ వ్యాపారవేత్తను మిల్కీ బ్యూటీ వివాహం చేసుకోనున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. తమన్నా వయస్సు ప్రస్తుతం 33 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లు ఉండటంతో ఈ సమయంలో పెళ్లిపై దృష్టి పెడితే కెరీర్ పై ప్రభావం పడుతుందని తమన్నా భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరో రెండేళ్ల వరకు తాను పెళ్లి చేసుకోనని తమన్నా తేల్చి చెప్పారని

2025 సంవత్సరంలో తమన్నా పెళ్లి జరిగే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. పెళ్లి విషయంలో తుది నిర్ణయం తమన్నాదే అని తెలుస్తోంది. తమన్నా సైతం తాజాగా పెళ్లికి ఇది సరైన సమయం కాదని చెప్పినట్టు బోగట్టా. గతంతో పోలిస్తే తమన్నాకు ఆఫర్లు తగ్గినా ఆమె ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఎఫ్3 సినిమాలో తమన్నా ఒక హీరోయిన్ గా నటించగా వచ్చే నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఈ సినిమాతో తమన్నా ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కథ నచ్చితే తమన్నా వెబ్ సిరీస్ లలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus