Tamanna: హీరోలు చేస్తే మీకు తప్పు అనిపించడం లేదా: తమన్నా సూటి ప్రశ్న

హీరోయిన్‌ స్కిన్‌ షో చేసినా సమస్యే, చేయకపోయినా సమస్యే… కథానాయిక కురచ బట్టలు వేసుకున్నా సమస్యే, వేసుకోకపోయినా సమస్యే, ముద్దుగుమ్మ ముద్దులు పెట్టినా సమస్యే, పెట్టకపోయినా సమస్యే.. ఏంటీ కన్‌ఫ్యూజ్‌ అంటున్నారా? ఇది మేం అంటున్నది కాదు. టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న విషయమే ఇది. దీనికి తాజా ఉదాహరణ.. 18 ఏళ్లుగా స్కిన్‌ షో చేసినా.. కిస్‌ సీన్స్‌, ఇంటిమేట్‌ సీన్స్‌ చేయని తమన్నా.. ఇప్పుడు వెబ్‌ సిరీస్‌ల కోసం చేసింది. దీంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

‘లస్ట్‌ స్టోరీస్‌ 2’, ‘జీ కర్దా’ వెబ్‌ సిరీస్‌లతో (Tamanna) తమన్నా ఇప్పుడు ఓటీటీ రంగంలో, సోషల్‌ మీడియా వేదికల్లో టాక్‌ ఆఫ్‌ ది డేగా మారుతోంది. రోజూ ఏదో కామెంట్‌, ఇంకేదో రియాక్షన్‌, మరేదో డిస్కషన్‌తో ఆమె పేరు వినిపిస్తూనే ఉంది. తమన్నా ఎందుకు ఇంతలా మారిపోయింది అనే కామెంట్స్‌ వినిపిస్తూనే ఉన్నాయి. వాటికి ఆమె సమాధానాలు ఇస్తూనే ఉంది. అయితే ఈసారి ఇంకాస్త కఠినంగా సమాధానం ఇచ్చింది అని చెప్పాలి. అంతేకాదు హీరోల విషయం కూడా మధ్యలోకి లాగింది.

సినిమాలు, సిరీస్‌ల్లో హీరోలు బోల్డ్‌ సన్నివేశాలు చేస్తే ఎవరూ విమర్శలు చేయరు.. హీరోయిన్లు, లేడీ ఆర్టిస్ట్‌లు చేస్తే మాత్రం ఇంతటి నెగిటివటీ ఎందుకు వస్తోందో అర్థం కావడం లేదని కామెంట్స్‌ చేసింది తమన్నా. అసలు ఈ యుగంలో నా సిరీస్‌లకు ఇలాంటి వ్యతిరేకత వస్తుందని అనుకోలేదు. కొంతమంది సోషల్‌ మీడియాలో నాపై విమర్శలు చేయడం చూస్తుంటే వింతగా ఉంది. అసలు అలా ఎందుకు ఆలోచిస్తున్నారో కూడా అర్థం కావడం లేదు అని తమన్నా కామెంట్స్‌ చేసింది.

కెరీర్‌ మొదలైన నాటి నుండి గ్లామర్‌ పాత్రలు చేస్తూనే ఉన్నా అని, అయితే ఇంటిమేట్‌ సీన్స్‌లో యాక్ట్‌ చేస్తే పర్సనల్‌ ఎటాక్‌ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. హీరోలు ఇలాంటి సీన్స్‌ చేస్తూనే ఉంటారు. వాళ్లు సూపర్‌ స్టార్స్‌ కూడా అవుతున్నారు. 18 ఏళ్ల నా కెరీర్‌లో రూల్స్‌ పాటించా. నో కిస్‌ పాలసీ నా కాంట్రాక్ట్‌లో ఉండేది. అయితే, కెరీర్‌ పరంగా వృద్ధి చెందాలంటే మారాలనే ఆలోచనతో నా ఆలోచనలు మార్చి ఈ ప్రాజెక్ట్‌లు చేశాను అని తమన్నా ఘాటుగా స్పందించింది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus