Tamannaah: తమన్నా ఆ సన్నివేశాలు చేయడానికి కారణం అదేనా?

తమన్నా మొదటి సినిమా నుండి గ్లామర్ రోల్సే ఎక్కువ చేసింది. ఆమె నటనతో మెప్పించిన సినిమాలు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. వాటి లిస్ట్ తీస్తే ‘100 % లవ్’ ‘సైరా’ వంటి సినిమాల్లో తప్ప.. పెద్దగా కథకి ప్రాధాన్యత ఇచ్చిన పాత్రలు చేసింది లేదు. పూర్తిగా గ్లామర్ తోనే నెట్టుకొచ్చింది అని చెప్పాలి.అదేంటో కానీ తమన్నా పెద్దగా కష్టపడకపోయినా ఆమెను తెగ పొగిడేస్తుంటారు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు.అందుకే కొంతమంది డైరెక్టర్స్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, ఐటెం సాంగ్స్ వంటివి కూడా చేసింది.

నితిన్ ‘మాస్ట్రో’ సినిమాలో విలన్ గా చేసిన తమన్నా.. ఏదో ఒక రకంగా తన స్టార్ స్టేటస్ ను కాపాడుకుంటూ వస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ‘జీ కర్దా’ ‘లస్ట్ స్టోరీస్’ వంటి వెబ్ సిరీస్లలో మునుపెన్నడూ లేని విధంగా బెడ్ రూమ్ సీన్స్ లో నటించి షాకిచ్చింది తమన్నా. హద్దులు దాటి ఇలాంటి సన్నివేశాల్లో నటిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అవకాశాలు లేకపోవడం వల్లే తమన్నా ఇలా దిగజారిందని అనుకుంటే తప్పే.

ఆ వెబ్ సిరీస్ మేకర్స్ మొదట ఇలాంటి సీన్స్ ఉంటాయి అని చెబితే (Tamannaah) తమన్నా ఒప్పుకోలేదట. కానీ పారితోషికం డబుల్ చేస్తామంటే ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. తమన్నా ప్రస్తుతం ఒక్కో సినిమాకి కోటిన్నర తీసుకుంటుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ల కోసం ఆమె రెండున్నర కోట్లు పైనే పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది.

అంటే రూ.5 కోట్ల వరకు తమన్నా ఖాతాలో పడ్డాయన్న మాట. అంతేకాకుండా నెట్ ఫ్లిక్స్ , జీ 5 వంటి వారికి మరిన్ని వెబ్ సిరీస్ లు సైన్ చేసింది ఈ బ్యూటీ. అవి కూడా భారీ పారితోషికానికే..!

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus