అన్ని కోట్లు పెట్టి.. అంత పాత ఇల్లు కొనుక్కోవడం ఏమిటో ?

మరి దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే నానుడిని బలంగా నమ్మిందో లేక.. తన కెరీర్ ఇకపై మునుపటిలా నల్లేరు పై నడకలా సాగదని తెలుసుకొందో తెలియదు కానీ ఉన్నట్లుండి ముంబైలోని ఒన్నాఫ్ ది మోస్ట్ కాస్ట్లీయస్ట్ ఏరియా అయిన వారసోవా అనే ఏరియాలో 2000 చదరపు అడుగుల ఫ్లాట్ ను కొన్నది. తమన్నా ఆ ఏరియాలో కొనడం తప్పు కాదు కానీ.. కొన్న రేటే అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. తమన్నా కొన్న ఫ్లాట్ రేట్ అక్షరాల 16 కోట్లు. నిజానికి ఆ ఏరియాలో ఉన్న రేటు ప్రకారం తమన్నా కొన్న ఫ్లాప్ ఏడెనిమిది కోట్ల లోపు రావాలి… కానీ ఆ ఫ్లాట్ కి సముద్రం వ్యూ ఉందన్న ఏకైక కారణంతో తమన్నా ఏకంగా 16 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లాట్ కొనడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇదంతా బాగానే ఉంది కానీ.. తమన్నాకి ప్రస్తుతం తెలుగులో “రాజుగారి గది 3” తప్పితే మరో సినిమా లేదు. ఆమె నటించిన “సైరా”లోనూ చిన్న పాత్ర మాత్రమే. మరి ఇలాగే కంటిన్యూ అయితే కనుమరుగైపోయిన కథానాయికల ప్లేస్ లో తమన్నా పేరు కూడా వచ్చి చేరుతుంది. మరి ఈ స్లంప్ నుంచి తమన్నా ఎప్పుడు బయటపడుతుందో చూడాలి. బై ద వే.. కాంగ్రాచూలేషన్స్ తమన్నా ఫర్ ది న్యూ & కాస్ట్లీ హోమ్ ఇన్ ముంబై.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus