గ్లామర్ షో విషయంలో తమన్నా ఘాటుగా స్పందిస్తుంది..!

మంచి డెడికేషన్ ఉన్న హీరోయిన్ అంటూ తమన్నా పై గతంలో స్టార్ దర్శకులు రాజమౌళి, సుకుమార్ లు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. షూటింగ్ ఉందంటే.. ఆన్ టైములో లొకేషన్లో ఉంటుందని.. సెట్స్ లో కనీసం ఫోన్ కూడా చూడదంటూ తమన్నా ను ఓ రేంజ్ లో పొగిడేశారు ఆ రోజుల్లో. ఇక గ్లామర్ విషయంలో కూడా తమన్నా కొన్ని హద్దులు పెట్టుకునే.. అనుచరిస్తూ వచ్చింది. ఆ విధంగానే యూత్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకుంది. బోల్డ్ లిప్ లాక్ సీన్లలో తమన్నా ఇప్పటి వరకూ నటించలేదు. అయితే యాక్షన్ సినిమాలో బికినీ కూడా ధరించిందని సమాచారం.

ఈ విషయాల పై ‘యాక్షన్’ సినిమా ప్రమోషన్లో చెప్పుకొచ్చింది తమన్నా. ఆమె మాట్లాడుతూ.. “`బికినీ వేసుకోవాలంటే సరైన శరీరాకృతి ఉండాలి. నాకు అలాంటి శరీరం లేదని అనుకునేదాన్ని. కానీ, ఈ సినిమా కోసం కఠినమైన డైట్, ఎక్సర్‌సైజ్‌లు చేసి బరువు తగ్గాను. కెరీర్ ప్రారంభం నుంచి నేను కొన్ని హద్దులు పెట్టుకున్నాను. ముద్దు సీన్లలో నటించకూడదని అనుకున్నా. ఇప్పటికీ అలాగే ఉన్నా. అయితే గ్లామరస్‌గా కనిపించడానికి మాత్రం నేనెప్పుడూ సిద్ధమే’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus