చిట్టి గౌనులో జిగేల్మనిపిస్తున్న తమన్నా.. ఫోటో వైరల్..!

కొంతమందిని చూస్తే వయసు పెరిగే కొద్ది వాళ్ల అందం కూడా అలాగే పెరుగుతుంది. ఇలాంటి వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. మూడు పదుల వయసు క్రాస్ చేసినా ఆమె అందంలో కాస్త కూడా తేడా రావడం లేదు. త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా. ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం గోపిచంద్ హీరోగా నటిస్తోన్న ‘సీటీమార్’ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది.

ఇటీవల కరోనా బారిన పడిన తమన్నా.. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొంది క్షేమంగా ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంత విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగులతో బిజీ అయిపోయింది. తాజాగా విమానాశ్రయాల చుట్టు చక్కర్లు కొడుతున్న ఫోటోల్ని మిల్కీ బ్యూటీ షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబై వీధుల్లో ఇలా బ్లాక్ లెదర్ బ్యాగ్ తో ప్రత్యక్షమైంది. ఆ ఫోటోలో తమన్నా ధరించిన థై హై డ్రెస్ మాత్రం వీక్షకుల కంటికి కనువిందుగా ఉంది.

పసుపు తెలుపు గడుల ఫ్రాకు ఆమె సొగసుల్ని ఎలివేట్ చేసింది. దీంతో ఆ ఫోటోపై అభిమానులు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ముంబై విధుల్లో తమన్నా అలా లెగ్స్ అందాలు చూపిస్తూ నడుస్తుండడంతో కొందరి కళ్ళు జిగేలుమన్నాయి. ఇక తమన్నా గతంలో కనిపించినట్లుగా అయితే లేదు. ఆమె ఫిట్నెస్ లో కాస్త మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. కాస్త బొద్దుగా మారిందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. కోవిడ్ కారణంగా ఎలాంటి వర్కవుట్లు చేయకుండా నాలుగు గోడల మధ్య వుండిపోవడం, ప్రత్యేకమైన టాబ్లెట్స్ వేసుకోవడం వలన తమ్మూ బరువు పెరిగిందట.

1

2

3

4

5

6

7

8

 

9

10

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus