తమన్నా క్యారెక్టర్ తెలిసిపోయింది!

  • August 3, 2016 / 12:46 PM IST

మొదటిసారి తమన్నా ‘అభినేత్రి’ అనే హారర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నాతో పాటు ప్రభుదేవా, సోనూసూద్ లో ప్రధానమైన పాత్రలో కనిపించబోతున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రభుదేవా ఈ సినిమాలో తమన్నా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో రివీల్ చేశాడు. ఆయన మాటల ప్రకారం తమన్నా ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తుంది.

ఒకటి మోడర్న్ అమ్మాయి కాగా.. మరొకటి పల్లెటూరి అమ్మాయి పాత్ర. ఓ మధ్యతరగతి అమ్మాయికి చిన్నప్పటినుండి సినిమాలంటే పిచ్చి. పెళ్ళయిన తరువాత ఆ అమ్మాయి హీరోయిన్ గా ఎలా మారింది. హీరోయిన్ అయిన తరువాత తను ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది అనే విషయాలకు హారర్ ఎలిమెంట్స్ జోడించి సినిమా తీశారట. ఇప్పటికే ఈ సినిమా టీజర్స్ కు విపరీతమైన స్పందన లభించింది. ఇక సినిమా ఎలా ఉంటుందో రిలీజ్ వరకు ఎదురుచూడాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus