Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » నిఖిల్‌ కుమార్‌ ‘జాగ్వార్‌’లో తమన్నా స్పెషల్‌ సాంగ్‌!

నిఖిల్‌ కుమార్‌ ‘జాగ్వార్‌’లో తమన్నా స్పెషల్‌ సాంగ్‌!

  • August 31, 2016 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిఖిల్‌ కుమార్‌ ‘జాగ్వార్‌’లో తమన్నా స్పెషల్‌ సాంగ్‌!

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్‌, ప్రముఖ నిర్మాత హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం ‘జాగ్వార్‌’. హెచ్‌.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జాగ్వార్‌’ కోసం ఇటీవలే బల్గేరియాలో కోట్ల రూపాయల వ్యయంతో హై రేంజ్‌లో కొన్ని యాక్షన్‌ సీన్స్‌ని చిత్రీకరించారు. ముఖ్యంగా ఇంటర్వెల్‌ ఫైట్‌ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. ఈ ఫైట్‌ సినిమాకి హైలైట్‌గా నిలవనుంది.

ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి వండర్‌ఫుల్‌ రెస్పాన్స్‌
ఈ చిత్ర విశేషాలను సమర్పకులు హెచ్‌.డి.కుమారస్వామి తెలియజేస్తూ – ”రీసెంట్‌గా చలన చిత్ర ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా రిలీజ్‌ చేసిన ‘జాగ్వార్‌’ ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి వండర్‌ఫుల్‌ రెస్పాన్స్‌ వస్తోంది. నిఖిల్‌కుమార్‌ అత్యద్భుతంగా నటించాడని టీజర్‌ చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈమధ్యనే నేను పవన్‌కళ్యాణ్‌గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాను. ఆ సమయంలో ‘జాగ్వార్‌’ టీజర్‌ని పవన్‌ కళ్యాణ్‌గారు చూసి.. ‘టీజర్‌ చాలా బాగుంది. నిఖిల్‌కుమార్‌కి హీరోగా మంచి భవిష్యత్‌ వుంటుంది. హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీస్‌ వున్నాయి. డెఫినెట్‌గా సక్సెస్‌ అవుతాడు” అని చిత్ర యూనిట్‌ని అప్రిషియేట్‌ చేశారు.

తమన్నా స్పెషల్‌ సాంగ్‌
ఫస్ట్‌లుక్‌తోనే మా అబ్బాయి నిఖిల్‌కుమార్‌ అందరి ప్రశంసలు అందుకోవడం నాకు చాలా ఆనందంగా వుంది. బిజినెస్‌పరంగా ‘జాగ్వార్‌’ సినిమాకి మంచి క్రేజ్‌ వస్తోంది. ఈ చిత్రంలో గ్లామర్‌ హీరోయిన్‌ తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌ చేస్తోంది. ఈ పాట సినిమాకి మంచి ప్లస్‌ అవుతుంది. అలాగే ఈ చిత్రానికి ఇండస్ట్రీలో వున్న టాప్‌ టెక్నీషియన్స్‌, ఆర్టిస్ట్‌లు ఈ చిత్రానికి వర్క్‌ చేస్తున్నారు. సెప్టెంబర్‌ 5 నుండి ఈ చిత్రం షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ షెడ్యూల్‌లో ఓ ప్రముఖ టాప్‌ హీరోయిన్‌తో స్పెషల్‌ సాంగ్‌ని చిత్రీకరిస్తాం. ఈ పాట ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఎంటర్‌టైన్‌ చేసేవిధంగా వుంటుంది.

థమన్‌ మ్యూజిక్‌ ఎక్స్‌లెంట్‌!!
ఎన్నో సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాలకి మ్యూజిక్‌ చేసిన సక్సెస్‌ఫుల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ ఈ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ని అందించారు. రామ జోగయ్య శాస్త్రి ఈ చిత్రంలో అన్ని పాటల్ని ఒకదాన్ని మంచి మరొకటి అద్భుతంగా వుండేలా రాశారు. ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా సెప్టెంబర్‌ 18న సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ‘జాగ్వార్‌’ ఆడియో ఫంక్షన్‌ని హైదరాబాద్‌ హైటెక్స్‌ నోవాటెల్‌లో అత్యంత వైభవంగా జరపనున్నాం.

దసరా కానుకగా అక్టోబర్‌ 6న సినిమా రిలీజ్‌!!
విజయేంద్రప్రసాద్‌గారు ఈ చిత్రానికి అత్యద్భుతమైన కథని అందించారు. మనోజ్‌ పరమహంస ఫొటోగ్రఫీ, మహదేవ్‌ టేకింగ్‌, థమన్‌ మ్యూజిక్‌ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనున్నాయి. నిఖిల్‌కుమార్‌కి జోడీగా దీప్తి నటించింది. అలాగే ఈ చిత్రంలో నా ఫ్రెండ్‌ జగపతిబాబు ఓ విలక్షణమైన పాత్ర పోషిస్తుండగా, రమ్యకృష్ణ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ తారాగణంతో 75 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ప్రేక్షకులందరికీ నచ్చేవిధంగా అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా అక్టోబర్‌ 6న వరల్డ్‌వైడ్‌గా ‘జాగ్వార్‌’ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

‘జాగ్వార్‌’ నాకు చాలా మంచి చిత్రమవుతుంది
హీరో నిఖిల్‌కుమార్‌ మాట్లాడుతూ – ”నాకు తెలుగంటే ఇష్టం. ఎక్కువగా తెలుగు సినిమాలను చూస్తుంటాను. విజయేంద్ర ప్రసాద్‌గారు మా నాన్నగారిని కలవడానికి వచ్చినపుడు మీ అబ్బాయిని మా అబ్బాయి అనుకుని నా చేతుల్లో పెట్టండి అన్నారు. అది నాకిప్పటికీ గుర్తే. అలా విజయేంద్రప్రసాద్‌గారు ఓ మంచి కథను సిద్ధం చేశారు. మహదేవ్‌గారు ఎంతో కష్టపడి సినిమాను డైరెక్ట్‌ చేశారు. మనోజ్‌ పరమహంస బ్యూటిఫుల్‌ సినిమాటోగ్రఫి అందించారు. థమన్‌ ఫెంటాస్టిక్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. నావంతుగా నేను బెస్ట్‌ ఎఫర్ట్స్‌ పెట్టివర్క్‌ చేశాను. తప్పకుండా ఇది నాకు చాలా మంచి చిత్రమవుతుంది. ఈ చిత్రాన్ని సక్సెస్‌ చేసి తెలుగు ప్రేక్షకులు నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను” అన్నారు.

జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్‌, ఆదిత్యమీనన్‌, భజ్రంగ్‌ లోకేష్‌, అవినాష్‌, వినాయక్‌ జోషి, ప్రశాంత్‌, సుప్రీత్‌ రెడ్డి, రావు రమేష్‌, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి, కథ: విజయేంద్ర ప్రసాద్‌, సినిమాటోగ్రఫి: మనోజ్‌ పరమహంస, మ్యూజిక్‌: యస్‌.యస్‌. థమన్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్‌: రవివర్మ, రామ్‌-లక్ష్మణ్‌, కలోయాన్‌ (బల్గేరియా), సెల్వ, కో డైరెక్టర్‌: అమ్మినేని మాధవసాయి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఎ. మహదేవ్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepti Sati
  • #Jaguar Movie
  • #Nikhil Kumar
  • #Tamannaah
  • #thaman

Also Read

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

trending news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

51 mins ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

8 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

13 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

13 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

14 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

4 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

9 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

10 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

11 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version