వంట షోకు కథానాయిక తమన్నాను తీసేసి హాట్ యాంకర్ అనసూయను తీసుకుంటున్నారని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. దీని మీద తాజాగా క్లారిటీ వచ్చింది. అంతేకాదు ఈ విషయంలో తమన్నా ఏం చేస్తుంది అనే విషయంలోనూ స్పష్టత వచ్చింది. తమన్నా వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం… ఈ విషయంలో ఆమె చాలా సీరియస్‌గా ఉందట. ఏకంగా కోర్టు మెట్లు ఎక్కబోతోందట.
‘మాస్టర్ చెఫ్’ కార్యక్రమంలో హోస్ట్‌గా అవకాశం రావడంతో… ఓ సినిమా ఛాన్స్‌ను పక్కన పెట్టి మరీ తమన్నా… ఒప్పేసుకుందట. అయితే ఇప్పుడు అర్ధాంతరంగా ఆమెను తప్పించడంతో అటు సినిమా పోయి, ఇటు షో కూడా పోయిందని బాధపడుతోందట. అంతేకాదు తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఇలా తొలగించేయడం పట్ల గుర్రుగా ఉందట. అందుకే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుందట.
ఇప్పటికే దీనికి సంబంధించి ఆమె వ్యక్తిగత సిబ్బంది పనులు మొదలుపెట్టారని టాక్. తమన్నా తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘మాస్టర్ చెఫ్’ కార్యక్రమాన్ని రూపొందించే ఇన్నోవేటివ్ ఫిలిం అకాడమీపై లీగల్‌గా ప్రొసీడ్ అవుతాం. తమన్నాకు పేమెంట్ ఎగ్గొట్టమే కాకుండా… ఆమెతో కమ్యునినేషన్ కట్ చేశారు. దీంతో మాకు వేరే ఆప్షన్ కనిపించడం లేదని చెప్పారట. దీనిపై మాస్టర్ చెఫ్ నిర్వాహకులు స్పందించాల్సి ఉంది.