Tamanna: ఫేడవుట్ అయిపోయిన హీరోతో తమన్నా రొమాన్స్!

  • October 28, 2022 / 03:09 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. ఒకప్పుడు భారీ రెమ్యునరేషనా కూడా అందుకుంది. కెరీర్ లో హిట్స్ వచ్చిన ప్రతీసారి రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోయింది. తన డిమాండ్ కి తగ్గట్లే నిర్మాతలు కూడా ఆమె అడిగినంత చెల్లించేవారు. దీంతో చాలా కాలం పాటు ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగింది. దాదాపు పదేళ్లకు పైగానే ఇండస్ట్రీలో నెట్టుకొచ్చింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

అయితే ఇప్పుడు తమన్నాకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. దీంతో తన రెమ్యూనరేషన్ తగ్గించుకుంది. తక్కువ పారితోషికం ఇస్తున్న సినిమాలకు కూడా సై అంటోంది. ఈ క్రమంలో ఓ మలయాళీ సినిమా చేయడానికి రెడీ అయింది. అక్కడి హీరో దిలీప్ తో కలిసి రొమాన్స్ చేయబోతుంది. ఇది తమన్నాకు తొలి మలయాళీ సినిమా. ఇప్పటివరకు ఆమె మాలీవుడ్ లో నటించలేదు. ఇదివరకు అవకాశాలు వచ్చినా..

బిజీగా ఉండడంతో మలయాళ సినిమాలు ఒప్పుకోలేదు. ఇప్పుడు మరోసారి ఆమెకి ఛాన్స్ రావడంతో ఓకే చేసింది. మలయాళీ సినిమాలకు ఇప్పుడు అన్ని చోట్లా మంచి మార్కెట్ ఉంది. గతంతో పోలిస్తే అక్కడ కూడా పారితోషికాలు బాగానే పెరిగాయి. అయితే హీరోగా దిలీప్ కెరీర్ దెబ్బతింది. వివాదాలు, జైలు జీవితం.. దిలీప్ స్థాయిని బాగా తగ్గించాయి. ఒకప్పుడు స్టార్ హీరోనే అయినప్పటికీ.. ఇప్పుడు ఆయనకు అంత క్రేజ్ లేదు.

దిలీప్ విషయంలో మలయాళీ ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిపోయింది. కేరళ దాటితే అతడి సినిమాలను పట్టించుకునేవారు కూడా లేరు. దీంతో అతడి మార్కెట్ బాగా తగ్గింది. అయినప్పటికీ.. తమన్నా ఇలాంటి సినిమా చేయడానికి ఒప్పుకుంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus