ఇటీవల గ్లామర్ షో, వెబ్ షోస్‌లో రెగ్యులర్‌గా కనిపించిన తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఇప్పుడు పూర్తిగా తన ఇమేజ్‌కు భిన్నంగా ఒక పాత్రలో అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘ఓదెలా రైల్వే స్టేషన్’కి (Odela Railway Station) సీక్వెల్‌గా వస్తున్న ‘ఓదెలా 2’లో శివ భక్తురాలిగా ఒక అఘోర పాత్రలో కనిపించనుంది. ఇది తమన్నా కేరోర్ లోనే ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌గా మారబోతుందన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని అశోక్ తేజ (Ashok Teja) దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.
అయితే కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ అన్నీ కూడా ప్రముఖ దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) సూపర్‌విజన్‌లో జరుగుతుండటం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై మంచి ఆసక్తి నెలకొంది. సంగీతం అందించిన అజినిష్ లోకనాథ్ (B. Ajaneesh Loknath) ఇప్పటికే ‘కాంతార’ సినిమాతో తన మార్క్ ను చూపించిన వ్యక్తి కావడంతో, ఈ సినిమాలో ఆయన బాణీలు కథకు ఇంకో లెవెల్ క్రేజ్ అందించనున్నాయి. ఇక తమన్నా గత కొన్ని సినిమాల్లో హిట్ రేంజ్‌కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
వన్‌వుమన్ షోగా మలిచిన ఓటిటి కంటెంట్ వల్ల అంచనాలున్నా, ఫలితాలు ఆశించిన స్థాయికి రాలేదు. అందుకే ఈసారి ఓ థియేట్రికల్ భారీ థ్రిల్లర్‌తో పునరాగమనానికి సిద్ధమవుతోంది. డివైన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె పాత్రను చాలా ఇంటెన్స్‌గా డిజైన్ చేశారని సమాచారం. ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కాబోతోంది. వేసవి సెలవులు ప్రారంభమయ్యే టైమింగ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద దీని రిలీజ్ డేట్ పర్ఫెక్ట్ గా సెటయ్యిందని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.
ముఖ్యంగా వేసవిలో పెద్ద సినిమాల విడుదలలు తక్కువగా ఉండటంతో, ‘ఓదెలా 2’ వంటి కాన్సెప్ట్ థ్రిల్లర్లకు మంచి స్పేస్ దొరకనుంది. తమన్నా లుక్ ఇప్పటికే విడుదలైన పోస్టర్‌తో ఆసక్తి రేపుతోంది. ఆలయ వాతావరణం, ఇంటెన్స్ ఎమోషన్స్, మిస్టిక్ హ్యాండిలింగ్‌తో కథ నడవనుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే తమన్నాకు సెకండ్ ఇన్నింగ్స్‌లో సాలిడ్ బ్రేక్ కావొచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.