ఆర్ధిక సాయం కోరుతున్న ఒకప్పటి విలన్!

ఆరోగ్యం క్షీణించడంతో కనీసం హాస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు ఒకప్పటి నటుడు పొన్నంబళం. ఆర్ధిక సాయం చేసి తనను ఆదుకోవాలని కోరుకుంటున్నారు . తెలుగు, తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో నటించి విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పొన్నంబళం. తెలుగులో కూడా ఆయన చాలా సినిమాల్లో నటించారు. కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురైన ఈ నటుడు చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో కిడ్నీ మార్పిడి చికిత్సకు సిద్ధమవుతున్నాడు. అయితే ట్రీట్మెంట్ కి కావాల్సిన డబ్బు తన దగ్గర లేకపోవడంతో సినీ రంగంలోని ప్రముఖులను ఆర్ధిక సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. గత ఐదేళ్లుగా తన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ప్రాణాన్ని కాపాడుకోవడానికి పోరాడుతూ వచ్చానని అన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి నుండి బయటపడి కిడ్నీ మార్పిడి చేయించుకోవడానికి సిద్ధమయ్యానని అన్నారు.

తన సోదరి కొడుకు కిడ్నీ దానం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం తనకు ఎలాంటి ఆదాయం లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుందని చెప్పారు. ఇప్పటికే రజినీకాంత్, కమల్ హాసన్, రాధికా శరత్ కుమార్, కెఎస్ రవికుమార్, రాఘవ లారెన్స్ వంటి ప్రముఖులు ఆర్థిక సాయం చేశారని తెలిపారు. అయితే ప్రస్తుతం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ట్రీట్మెంట్ కి డబ్బు అవసరం ఉందని.. కాబట్టి దాతలు, దక్షిణ భారత నటీనటుల సంఘం, తెలుగు ‘మా అసోసియేషన్’ తరఫున ఆర్ధిక సాయం అందించాలంటూ కోరుతున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus