బాలీవుడ్ హీరోయిన్ ని ఫైనల్ చేసిన తమిళ ‘అర్జున్ రెడ్డి’ టీం..!
- February 16, 2019 / 12:02 PM ISTByFilmy Focus
టాలీవుడ్ లో సంచలన విజయాన్ని నమోదుచేసిన విజయ్ దేవరకొండ – సందీప్ రెడ్డి వంగ ల ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో విక్రమ్ కొడుకు ధృవ్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు. ‘వర్మ’ పేరుతో ఈ చిత్రాన్నిమొదట విభిన్న చిత్రాల దర్శకుడు బాలా డైరెక్ట చేసినప్పటికీ… ఫైనల్ కాపీ చూసిన నిర్మాతలకు మరియు విక్రమ్ కు ఇది నచ్చకపోవడంతో.. ఈ చిత్రం మొత్తాన్ని వేరే దర్శకుడితో రీషూట్ చేయడానికి రెడీ అయ్యారు.
- దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
- ‘మజిలీ’ టీజర్ రివ్యూ
హీరోయిన్ తో సహా కొంతమంది నటీనటుల్ని మార్చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా తెలుగు వెర్షన్ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ శిష్యుడు గిరీశయ్య ఈ తమిళ రీమేక్ ను డైరెక్ట్ చేసే అవకాశం ఉందని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. ఇక హీరోయిన్ గా మేఘ చౌదరి ప్లేస్లో బాలీవుడ్ బ్యూటీ బణిత సందు ను సెలెక్ట్ చేసారట. హిందీలో ఈ భామ ‘అక్టోబర్’ అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి స్పందన లభించింది. దీంతో నిర్మాతలు, విక్రమ్ ఈమెను హీరోయిన్ గా ఫైనల్ చేశారట.












