12 ఏళ్ల క్రితం సినిమాకు ఇప్పుడు అవార్డులు!

  • September 5, 2022 / 03:05 PM IST

నటులకు అవార్డులు, ప్రశంసలకు మించిన ఆనందం, సంతృప్తి ఉండదు అంటారు. అందుకే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అవార్డులు ఇస్తుంటాయి. ఏటా.. చలనచిత్ర పురస్కారాలను ఇచ్చి మెచ్చుకుంటూ ఉంటాయి. అయితే ఏమైందో ఏమోకానీ ఇటీవల కాలంలో అలాంటివి టాలీవుడ్‌లో బాగా తగ్గిపోయాయి. మన దగ్గరే కాదు.. తమిళనాడులోనూ ఇదే పరిస్థితి. తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ను సుమారు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రకటించారు.

అందులోనూ ఒక ఏడాదివి కాదు.. ఏకంగా ఆరేళ్ల అవార్డులను ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్‌ చేసింది. అంటే 2009 నుండి 2014 వరకు వచ్చిన సినిమాలకు పురస్కారాలను ఇప్పుడు ప్రకటించారు. ఆదివారం ఆ అవార్డుల ప్రదానోత్సవ వేడుకను నిర్వహించారు. అందులో ముఖ్యమైన అవార్డుల పేర్లు, అందుకున్న వారి వివరాలు మీకోసం.

2009

ఉత్తమ చిత్రాలు – తొలి ఉత్తమ చిత్రం: పసంగ, ద్వితీయ ఉత్తమ చిత్రం: మాయాండీ కుడుంబతినార్‌, తృతీయ ఉత్తమచిత్రం: అచముండు అచముండు
ఉత్తమ నటుడు: కరణ్‌ (మలయన్)
ఉత్తమ నటుడు (స్పెషల్‌ జ్యూరీ ) – ప్రసన్న (అచముండు అచముండు)
ఉత్తమ నటి: పద్మప్రియ (పొక్కిషమ్‌)
ఉత్తమ నటి (స్పెషల్‌ జ్యూరీ ) – అంజలి (అంగడి తెరు)
ఉత్తమ దర్శకుడు : వసంత బాలన్‌ (అంగడి తెరు)
ఉత్తమ సంగీత దర్శకుడు – సుందర్‌ సి బాబు (నాడోడిగల్‌)

2010

ఉత్తమ చిత్రాలు – తొలి ఉత్తమ చిత్రం: మైనా, ద్వితీయ ఉత్తమ చిత్రం: కలావాణి, తృతీయ ఉత్తమచిత్రం: పుత్రన్‌
ఉత్తమ చిత్రం (జ్యూరీ ) – నమ్మ గ్రామం
ఉత్తమ నటుడు: విక్రమ్‌ (రావణన్‌)
ఉత్తమ నటుడు (స్పెషల్‌ జ్యూరీ ) – వైజీ మహేంద్రన్‌ (పుత్రన్‌)
ఉత్తమ నటి: అమలా పాల్‌ (మైనా)
ఉత్తమ నటి (స్పెషల్‌ జ్యూరీ ) – సంగీత (పుత్రన్‌)
ఉత్తమ దర్శకుడు : ప్రభు సాల్మన్‌ (మైనా)
ఉత్తమ సంగీత దర్శకుడు – యువన్‌ శంకర్‌ రాజా (పయ్యా)

2011

ఉత్తమ చిత్రాలు – తొలి ఉత్తమ చిత్రం: వాగై సూద వా, ద్వితీయ ఉత్తమ చిత్రం: దెయివా తిరుమగళ్‌, తృతీయ ఉత్తమచిత్రం: ఉచితనై ముహర్న్‌తాళ్‌
ఉత్తమ చిత్రం (జ్యూరీ ) – మరీనా
ఉత్తమ నటుడు: విమల్‌ (వాగై సూద వా)
ఉత్తమ నటుడు (స్పెషల్‌ జ్యూరీ ) – ఇనెయా (వాగై సూద వా)
ఉత్తమ నటి: అనుష్క శెట్టి (దేవియా తిరుమగళ్‌)
ఉత్తమ నటి (స్పెషల్‌ జ్యూరీ ) – సంగీత (పుత్రన్‌)
ఉత్తమ దర్శకుడు : ఏఎల్‌ విజయ్‌ (దేవియా తిరుమగళ్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు – హారిస్‌ జైరాజ్‌ (కో)

2012

ఉత్తమ చిత్రాలు – తొలి ఉత్తమ చిత్రం: వాళ్‌హక్కు ఎన్‌ 18/9, ద్వితీయ ఉత్తమ చిత్రం: సాత్తాయ్‌, తృతీయ ఉత్తమచిత్రం: ధోనీ
ఉత్తమ చిత్రం (జ్యూరీ ) – కుమ్కీ
ఉత్తమ నటుడు: జీవా (నీతానే ఎన్‌ పొన్‌వసంతం)
ఉత్తమ నటుడు (స్పెషల్‌ జ్యూరీ ) – విక్రమ్‌ ప్రభు (కుమ్కీ)
ఉత్తమ నటి: లక్ష్మీ మేనన్‌ (కుమ్కీ)
ఉత్తమ నటి (స్పెషల్‌ జ్యూరీ ) – సమంత (నీతానే ఎన్‌ పొన్‌వసంతమ్‌)
ఉత్తమ దర్శకుడు : బాలాజీ శక్తివేల్‌(వాల్‌హక్కు ఎన్‌ 18/9)
ఉత్తమ సంగీత దర్శకుడు – డి ఇమ్మాన్‌ (కుమ్కీ)

2013

ఉత్తమ చిత్రాలు – తొలి ఉత్తమ చిత్రం: రామానుజన్‌, ద్వితీయ ఉత్తమ చిత్రం: తంగ మీనక్కళ్‌, తృతీయ ఉత్తమచిత్రం: పన్నాయిరమ్‌ పద్మినియుమ్‌
ఉత్తమ చిత్రం (జ్యూరీ ) – ఆళ్‌
ఉత్తమ నటుడు: ఆర్య (రాజా రాణి)
ఉత్తమ నటుడు (స్పెషల్‌ జ్యూరీ ) – విజయ్‌ సేతుపతి (ఇదర్‌కుంతనే ఆసిపట్టాయ్‌ బాలకుమార, పన్నాయరుమ్‌ పద్మినియమ్‌)
ఉత్తమ నటి: నయనతార (రాజా రాణి)
ఉత్తమ నటి (స్పెషల్‌ జ్యూరీ ) – నజ్రియా ఫహాద్‌ (నేరం)
ఉత్తమ దర్శకుడు : రామ్‌ (తంగ మీనక్కళ్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు – రమేశ్‌ వినాయగమ్‌ (రామానుజన్‌)

2014

ఉత్తమ చిత్రాలు – తొలి ఉత్తమ చిత్రం: కుట్రమ్‌ కాదితాళ్‌, ద్వితీయ ఉత్తమ చిత్రం: గోలీసోడా, తృతీయ ఉత్తమ చిత్రం: నిమిర్‌నందు నిల్‌
ఉత్తమ చిత్రం (జ్యూరీ ) – కాక ముట్టై
ఉత్తమ నటుడు: సిద్ధార్థ్‌ (కావ్య తలైవన్‌)
ఉత్తమ నటుడు (స్పెషల్‌ జ్యూరీ ) – బాబీ సింహా (జిగర్తండా)
ఉత్తమ నటి: ఐశ్వర్య రాజేశ్‌ (కాక ముట్టై)
ఉత్తమ నటి (స్పెషల్‌ జ్యూరీ ) – ఆనంది (కాయల్‌)
ఉత్తమ దర్శకుడు : రాఘవన్‌ (మంజప్పై)
ఉత్తమ సంగీత దర్శకుడు – ఏ ఆర్‌ రెహమాన్‌ (కావ్య తలైవన్‌)

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus