Allu Arjun, Atlee: అల్లు – అట్లీ.. ఆ తమిళ్ హీరో కూడా.!

అల్లు అర్జున్ (Allu Arjun) – అట్లీ (Atlee Kumar) కాంబినేషన్‌లో రాబోయే ప్రాజెక్ట్‌పై రోజుకో కొత్త అప్‌డేట్ వైరల్ అవుతోంది. పుష్ప 2తో (Pushpa 2: The Rule)  1800 కోట్ల కలెక్షన్స్ మార్క్‌ను టచ్ చేసిన బన్నీ, తన తదుపరి ప్రాజెక్ట్ కోసం అట్లీతో కలిసి ఓ భారీ మాస్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నాడు. మొదట త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేసినా, కొన్ని కారణాల వల్ల అది కాస్త వెనక్కి వెళ్లగా, బన్నీ అట్లీ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఈ సినిమాలో మరో స్టార్ హీరో కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్.

Allu Arjun, Atlee:

కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) ఈ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో, శివకార్తికేయన్ పాత్ర ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే పరశక్తి (Parasakthi) షూటింగ్ పూర్తి చేసేందుకు శివకార్తికేయన్ ప్లాన్ చేస్తున్నారని, అట్లీ ప్రాజెక్ట్ కోసం తన డేట్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో శివకార్తికేయన్ పాత్ర కేవలం గెస్ట్ రోల్ కాదని, కథలో కీలకంగా ఉండబోతుందని సమాచారం. అల్లు అర్జున్, శివకార్తికేయన్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే, ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇద్దరి నటనలో ఒక ఐకానిక్ ఫీల్ ఉండటంతో, ప్రేక్షకులకు మంచి ట్రీట్ లభించనుంది. ఈ భారీ ప్రాజెక్టును సన్ పిక్చర్స్ నిర్మించనున్నట్లు సమాచారం.

ఇక మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ లేదా సాయి అభ్యంకర్ ఎంపిక అయ్యే అవకాశముందని తెలుస్తోంది. జవాన్ సినిమాతో బాలీవుడ్‌లో భారీ హిట్ అందుకున్న అట్లీ, ఇప్పుడు టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక అనౌన్స్‌మెంట్ రాలేదు. కానీ, ఈ సినిమాలో శివకార్తికేయన్ నటిస్తారా? లేదా మరో స్టార్ నటుడి పేరు వినిపిస్తుందా అన్నది చూడాలి.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కి అలాంటి రెస్పాన్స్ కూడా వచ్చింది : దిల్ రాజు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus