Dil Raju: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కి అలాంటి రెస్పాన్స్ కూడా వచ్చింది : దిల్ రాజు

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమా మార్చి 7న రీ- రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. చాలా కొత్త సినిమాలు ఆ రోజు రిలీజ్ అవుతున్నప్పటికీ.. ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి అనే చెప్పాలి. దీంతో దిల్ రాజు (Dil Raju) తాజాగా ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించి.. ఈ బుకింగ్స్ కి మరింత పుష్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా.. ఆయన ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీడియా వారితో పంచుకున్న సంగతి తెలిసిందే.

Dil Raju

వాస్తవానికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా 2012 సంక్రాంతికి రిలీజ్ అయినప్పుడు కొంత మిక్స్డ్ టాక్ కూడా తెచ్చుకుంది. వెంకటేష్  (Venkatesh), మహేష్ బాబు  (Mahesh Babu) వంటి స్టార్ హీరోలను పెట్టుకుని ఇంత క్లాస్ సినిమా తీశారు ఏంటి? అని కొందరు అభిప్రాయపడితే.. ఇంకొంత మంది ఒక్క మాస్ ఎలిమెంట్ కూడా లేదు అంటూ బి,సి సెంటర్ ఆడియన్స్ పెదవి విరిచారు. అయితే సంక్రాంతి సీజన్ ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది.

ఫెస్టివల్ మూడ్ కి తగ్గట్టు సన్నివేశాలు ఉన్నాయని ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని డిస్టింక్షన్లో పాస్ చేశారు. అయితే ఒక 5 ఏళ్ళ తర్వాత ఈ సినిమాని మొదట్లో తిట్టిన ప్రేక్షకులు కూడా ప్రశంసించడం గమనార్హం. సోషల్ మీడియాలో సైతం ఈ సినిమా ఓ క్లాసిక్ అంటూ కొనియాడారు చాలా మంది. నిన్నటి ప్రెస్ మీట్లో దిల్ రాజుని (Dil Raju) కొంతమంది ఈ విషయం పై స్పందించారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రిలీజ్ రోజున చాలా మంది బాగుంది.

ఇద్దరి హీరోలతో ఓ కొత్త ప్రయత్నం చేశారు అని ఎక్కువ మంది పొగిడారు. అయితే ఇంకొంతమంది అసలు వెంకటేష్, మహేష్ బాబు.. వంటి హీరోల రేంజ్ సినిమా కాదు అని..! అలాంటి హీరోలని పెట్టుకుని ఇలాంటి సినిమాలు తీశారేంటి?’ అంటూ నెగిటివ్ గా రియాక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారని’ దిల్ రాజు చెప్పారు. అయితే ‘ఏదో ఊహించుకుని రావడం అనేది వాళ్ళ తప్పు. ఎందుకంటే మా సినిమాలో ఏం చూపించబోతున్నామో… రిలీజ్ కి ముందు స్పష్టంగా చెప్పాము’ అంటూ దిల్ రాజు తెలిపారు.

 ఇది గనుక వర్కవుట్ అయితే చాలామంది ఫాలో అవుతారు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus