ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల వారిని భీభత్సంగా భయపెడుతున్న ఇష్యూ “పైరసీ”. సినిమా విడుదలైన రోజు లేదా మరుసటి రోజు ఆల్మోస్ట్ హెచ్.డి క్వాలిటీ ప్రింట్స్ పైరేటెడ్ సైట్లలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఆ కారణంగా సినిమా కలెక్షన్స్ మొదటివారంలోనే దారుణంగా పడిపోతున్నాయి. ఈ విషయమై ఇప్పటికి వందలసార్లు పరిశ్రమ పెద్దలందరూ కూర్చుని మరీ మీటింగులు పెట్టి కోర్ట్ ను ఆశ్రయించినా పెద్దగా ఫలితం లేకపోయింది. అయితే.. సినిమా రిలీజయ్యాక పైరసీ జరగడం పక్కన పెడితే, విడుదలకు ముందే పైరసీ చేస్తాం అంటూ డైరెక్ట్ గా నిర్మాతలకే సవాలు విసురుతున్నారు పైరసీదారులు. ఇటీవల విజయ్ “సర్కార్” సినిమాకి కూడా ఇదే తరహాలో రచ్చ జరిగిన విషయం తెలిసిందే.
ఇప్పటికే తమిళ రాక్స్ పైరశీ సంస్థ విజయ్ సర్కార్, అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీలో రిలీజైన తొలి రోజే ఆన్ లైన్ లో విడుదల చేసేసింది.. ఇక ఇప్పుడు ఆ సంస్థ కన్ను సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ 2.0 మూవీపై పడింది.. రూ 600 కోట్లతో నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.. అదే రోజున ఆన్ లైన్ లో ఈ మూవీని విడుదల చేస్తామని తమిళ రాక్స్ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందించారు. ఇందులో అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. నిజంగానే తమిళ్ రాక్స్ సినిమాను ఆన్‌లైన్‌లో లీక్ చేస్తే నిర్మాతలకు భారీ నష్టం తప్పదని చిత్ర నిర్మాణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.