మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాతలలో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరనే సంగతి తెలిసిందే. తమ్మారెడ్డి భరద్వాజ ఆర్.ఆర్.ఆర్ మూవీ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్ల గురించి నాగబాబు, రాఘవేంద్రరావు నుంచి కౌంటర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అవార్డుల గురించి మాట్లాడుతూ తమ్మారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మనుషులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీకి సమాధానం చెప్పాలని ఆయన తెలిపారు.

ఆర్.ఆర్.ఆర్ మూవీ విషయంలో చేసిన కామెంట్ల విషయంలో నేను కట్టుబడి ఉన్నానని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ఒక క్లిప్పింగ్ ను దృష్టిలో పెట్టుకుని ఇంత రాద్ధాంతం చేయడం అవసరమా అని ఆయన కామెంట్లు చేశారు. నాకు చాలామంది అకౌంట్స్ తెలుసని తమ్మారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అవార్డుల కొరకు ఎవడి కాలు ఎవడు పట్టుకున్నాడో నాకు తెలుసని ఆయన చెప్పుకొచ్చారు. పదవుల కొరకు ఎవడు ఎవడిని అడుక్కున్నారో నాకు తెలుసని అందరు అకౌంట్ల గురించి నోరు విప్పితే ఎక్కడుంటారని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

ఇలా అడిగిన వాళ్లంతా చిన్న సినిమాల మీద చర్చలో కూర్చోగలరా అని ఆయన ప్రశ్నించారు. నా అ* మొగుడు నాకు సంస్కారం నేర్పాడని తమ్మారెడ్డి తెలిపారు. నాకు సంస్కారం ఉందని ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మొహం మీదే పడుతుందని ఆయన కామెంట్లు చేశారు. భూముల కోసం ప్రభుత్వాలకు ఎలా లెటర్స్ రాశారో ఇవ్వకపోతే ఎలా విమర్శించారో ఎలా కాళ్లు పట్టుకున్నారో తెలుసని తమ్మారెడ్డి అన్నారు.

మిమ్మల్ని విమర్శిస్తే ఇండస్ట్రీనే అన్నట్టే అందుకే నేను ఏమీ అనను అని ఆయన వెల్లడించారు. తమ్మారెడ్డి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తమ్మారెడ్డి విమర్శలకు నాగబాబు నుంచి కూడా ధీటుగా సమాధానం వస్తుండటం గమనార్హం. ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖుల విమర్శలు ఒకింత హద్దులు దాటుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus