Tammareddy Bharadwaja: ఏపీ ఎమ్మెల్యేలపై ఫైర్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ!

ప్రముఖ టాలీవుడ్ దర్శకనిర్మాతలలో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ వైసీపీ ఎమ్మెల్యేలు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లపై చేసిన వ్యాఖ్యల గురించి స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంను నిందిస్తున్న రాజకీయ నాయకులు తల దించుకోవాలని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. కులంతో సంబంధం లేకుండా ఉపాధి కల్పించే ఏకైక రంగం సినిమా రంగం అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. పుష్ప ప్రొడ్యూసర్స్ ఒక కులానికి చెందిన వాళ్లు కావడంతో మరో కులాన్ని సినిమాలో తిట్టించారని ప్రచారం చేస్తున్నారని సినిమాల విషయంలో కులాలు, మతాలు ఎందుకని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

కొంతమంది పొలిటీషియన్స్ గతంలో రెచ్చిపోయి మాట్లాడారని తమ్మారెడ్డి పేర్కొన్నారు. వాళ్లు గడ్డి తింటే మీరూ గడ్డి తింటారా? అని తమ్మారెడ్డి పేర్కొన్నారు. అందరూ ఓట్లు వేస్తేనే నాయకులు గెలిచారని ఒక కులం వాళ్లు ఓట్లు వేస్తే గెలవలేదని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముందని తమ్మారెడ్డి అన్నారు. పాలిటిక్స్ లోకి వచ్చిన సమయంలో నాయకుల ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

సినిమా వాళ్లు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పైసా పైసా ఏరుకుంటారని నాయకులలా రూపాయి ఇన్వెస్ట్ చేసి కోట్ల రూపాయలు దోచుకుతినడం లేదని ఆయన అన్నారు. పొలిటీషియన్స్ బెదిరింపులకు పాల్పడవద్దని మమ్మల్ని అనేముందు మీ సంగతి మీరు చూసుకోవాలని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ వల్ల ఏరోజు లెక్కలు ఆరోజు తెలుస్తాయి కాబట్టి ఓకే చెబుతామని తమ్మారెడ్డి పేర్కొన్నారు. ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు స్థానాన్ని భర్తీ చేయడం ఎవరి వల్లా కాదని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

ఏపీలో 30 శాతం సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయని కొంతమంది లాజిక్ లు తెలియకుండా మాట్లాడుతున్నారని తమ్మారెడ్డి కామెంట్లు చేశారు. తమ్మారెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీ నాయకులు తమ్మారెడ్డి చేసిన కామెంట్లపై ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఏపీలో తక్కువ టికెట్ రేట్ల వల్ల పెద్ద సినిమాల నిర్మాతలకు నష్టాలు వస్తున్నాయి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus