బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ రామాయణం కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు ఆది పురుష్ సినిమా ద్వారా రాబోతున్నారు. ఇక ఇందులో రాముడిగా ప్రభాస్ నటించిన సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయడంతో పెద్ద ఎత్తున ఈ టీజర్ విమర్శలను ఎదుర్కొంటుంది. అలాగే టీజర్ పై ఎంతో మంది స్పందిస్తూ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై చిత్ర బృందం స్పందిస్తూ ఇది 3డి సినిమా అని ఈ సినిమాని స్మాల్ స్క్రీన్ లో చూస్తే ఆ ఫీల్ రాదు బిగ్ స్క్రీన్ లో చూసినప్పుడే సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ సినిమా పట్ల ఎంతోమంది తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా ఇందులో కొన్ని సన్నివేశాలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.
ఇప్పటికే ఎంతోమంది ఈ టీజర్ పై స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సినిమా టీజర్ పై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇప్పుడే యూట్యూబ్లో ఆది పురుష్ సినిమా టీజర్ చూశానని తెలిపారు.ఈ సినిమా తనకు యానిమేషన్ సినిమా లాగా ఉందని ప్రభాస సినిమా లాగా కనిపించలేదని తెలిపారు. 500 కోట్ల బడ్జెట్ పెట్టి ప్రభాస్ చేసే సినిమా అని ఏమాత్రం అనిపించలేదని ఈయన తెలిపారు.
ఇక ఈ సినిమా టీజర్ పై ఎంతో మంది స్పందిస్తూ 3డీ, 4డీ అని చెబుతున్నారు. ఏం చేసిన యానిమేషన్ కి లైవ్ కు చాలా తేడా ఉంటుంది. త్రీడీలో చూసిన తరువాత ప్రతి ఒక్కరి అభిప్రాయం మారుతుందని చెబుతున్నారు. ఎక్కడ చూసినా వారి వస్త్రధారణ రూపురేఖలు మారవు కదా. రాముడును దేవుడిగా భావించే ఈ భారతదేశంలో ఏకంగా రాముడినే మార్చేశారు. ఇక రావణాసురుడు కూడా ఒక బ్రాహ్మణుడు ఆయనకు కూడా దేవాలయాలు ఉన్నాయి.మరో 20 రోజులలో కొత్త టీజర్ విడుదల చేస్తామని చెబుతున్నారు అంతలోగా చేయాల్సిన రిపేర్లు మొత్తం చేసి సినిమాని మంచిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు.