నాని చిత్రానికి పాట పాడనున్న తారక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేచురల్ స్టార్ నానికి అద్భుత కానుక ఇవ్వనున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి దక్కని గిఫ్ట్ అది. ఆ బహుమానం గురించి తెలుసుకునే ముందు  నాని ప్రస్తుతం ఏమి చేస్తున్నాడో తెలుసుకుందాం. అతను మ‌జ్ను గా మారి ఈనెల 23 న పలకరించడానికి సిద్ధమయి పోయాడు. ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించి వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మూవీలో విభిన్నమైన ప్రేమికుడిగా నాని ఎంటైర్ టైన్ చేయనున్నాడు. ఆ తర్వాత రెస్ట్ తీసుకోకుండా “నేను లోక‌ల్” సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. సినిమా చూపిస్తా మామ ఫేమ్ న‌క్కిన త్రినాధ‌రావు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రంలో ఓ పాటను తారక్ పాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సింగ‌ర్‌గా యంగ్‌ టైగ‌ర్‌  చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నారు. అదుర్స్‌లోని వేర్ ఈజ్ ది పంచెక‌ట్టు, య‌మ‌దొంగ‌లో ఓల‌మ్మి తిక్క‌రేగిందా..,తో పాటు నాన్న‌కు ప్రేమ‌తో మూవీలో “ఐ వన్న ఫాలో ఫాలో యూ” పాట‌ను అద్భుతంగా పాడారు. తన సినిమాల్లోనే కాకుండా ఎన్టీఆర్ క‌న్న‌డ సూప‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కోసం ఓ పాట ఆలపించారు. ఆ పాట సూపర్ హిట్ అయింది. తొలి సారి మరో హీరో పాట పాడడం ఇదే తొలి సారి. ఇప్పుడు తెలుగు హీరోలకు పాడడం ఇదే తొలి సారి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ కి కూడా యంగ్ టైగర్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు తెలిసింది.

https://www.youtube.com/watch?v=J1r4jsUJFOY

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus