గతకొద్ది రోజులుగా మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ నందమూరి తారక రత్న గురించిన వార్తలే వైరల్ అవుతున్నాయి. అతని ఆరోగ్య పరిస్థితి, ఫ్యామిలీ, ప్రేమ వివాహం, భార్య అలేఖ్య రెడ్డి.. వైసీపీ నేత విజయ సాయి రెడ్డికి కూతురు వరుస, తారక్ అల్లుడు వరుస అవుతారని పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి.. ప్రస్తుతం తారక రత్న చికిత్సకు స్పందిస్తున్నారని, అవయవాల పనితీరు బాగుందని.. త్వరలో కోలుకుంటాడని తెలిసింది. ఇదిలా ఉంటే తారక రత్న చిన్నప్పటి పిక్ ఒకటి సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.
కళ్లద్దాలు పెట్టుకుని, తాత నందమూరి తారక రామారావు పక్కన వినమ్రంగా నిలబడి ఉన్నాడు తారక్. ముఖం మీద పుట్టుమచ్చ ఉందప్పుడు. తర్వాత తొలగించుకున్నట్టున్నారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహన కృష్ణ తనయుడైన తారక రత్న 20 ఏళ్ల వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించిన రికార్డ్ తన పేరు మీదనే ఉంది. తర్వాత ప్రతినాయకుడిగానూ అలరించాడు తారక రత్న.