Taraka Ratna: భర్త మరణం నుంచి బయటపడని అలేఖ్య రెడ్డి… ఓదారుస్తున్న కూతురు!

సినీ నటుడు నందమూరి వారసులు తారకరత్న గత నెల 18వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే. గుండెపోటుకు గురైన ఈయన దాదాపు 23 రోజులపాటు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ గత నెల 18వ తేదీ మరణించారు. ఈ విధంగా తారకరత్న మరణించడంతో తన భార్య అలేఖ్య రెడ్డి ఒంటరిగా మిగిలిపోయి ఎంతగానో కుమిలిపోతున్నారు. ఇలా తారకరత్న మరణ వార్త నుంచి ఇంకా అలేఖ్య రెడ్డి బయటపడలేదని తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక నోట్ చూస్తే కనుక అర్థం అవుతుంది.

ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తారకరత్న ఇలా అర్థంతరంగా చనిపోవడంతో ఆ బాధ నుంచి ఆయన జ్ఞాపకాల నుంచి అలేఖ్య రెడ్డి బయటపడలేకపోతున్నారు. ఇలా తన భర్తను తలుచుకుంటూ ప్రతిరోజు ఏడుస్తూ కూర్చోవడంతో తన పెద్ద కుమార్తె నిషిక తన తల్లిని ఓదార్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన తల్లిని ఓదారుస్తూ నీషిక రాసినటువంటి ఒక నోట్ అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇందులో భాగంగా నిషిక తన తల్లిని ఓదార్పుతో అమ్మ నువ్వు చాలా బాధలో ఉన్నావు ఇంకోసారి ఇలా ఏడిస్తే నేను నీకు గుడ్ బై చెబుతా అంటూ రాసినటువంటి ఒక నోట్ షేర్ చేశారు. ఇది షేర్ చేసిన అలేఖ్య రెడ్డి నిన్ను చాలా మిస్ అవుతున్న అంటూ చెప్పుకొచ్చారు. ఇలా తన భర్తను తలుచుకొని రోజు ఏడుస్తూ కూర్చున్నటువంటి అలేఖ్య రెడ్డిని తన కుమార్తె ఓదారుస్తూ రాసినటువంటి నోట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇక అలేఖ్య రెడ్డి కూడా తారకరత్న మరణించడంతో ఆయనతో ఉన్నటువంటి జ్ఞాపకాలను తనతో కలిసి చివరిగా చేసిన ప్రయాణం గురించి కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ అయిన విషయం మనకు తెలిసిందే.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus