Alekhya Reddy: ఈ జన్మకు ఆ జ్ఞాపకాలతో బ్రతికేస్తా.. అలేఖ్యారెడ్డి కామెంట్స్ వైరల్!

తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తారకరత్న మరణం తర్వాత అలేఖ్యారెడ్డి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తారకరత్న మరణం తర్వాత అలేఖ్య సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ లు తెగ వైరల్ అవుతున్నాయి. తారకరత్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అలేఖ్య పోస్ట్ లు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. అలేఖ్యారెడ్డి తాజా పోస్ట్ లో “ఈ జీవితానికి నువ్వు నేను మాత్రమే.. లైఫ్ కు సరిపడా జ్ఞాపకాలను ఇచ్చి వెళ్లావు..

వాటితో నేను ముందుకు వెళతాను.. నా చివరి శ్వాస వరకు నేను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను” అని చెప్పుకొచ్చారు. మరో పోస్ట్ లో అలేఖ్యారెడ్డి తారకరత్న చిన్ననాటి ఫోటోను షేర్ చేయడంతో పాటు తన కొడుకుకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. వీళ్లే నా స్టార్స్ అంటూ ఆ ఫోటోల గురించి అలేఖ్యారెడ్డి కామెంట్ చేశారు. అలేఖ్యారెడ్డి పోస్ట్ లకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. అలేఖ్యారెడ్డికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

అలేఖ్యారెడ్డికి (Alekhya Reddy) ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాలయ్య తగిన జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. అలేఖ్యారెడ్డి తన పిల్లలకు ఎలాంటి కష్టం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అలేఖ్యారెడ్డిని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. అలేఖ్యారెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్నారు. అలేఖ్యారెడ్డి నెగిటివిటీకి దూరంగా ఉంటున్నారు. తారకరత్న, అలేఖ్యారెడ్డి పెళ్లి తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

కొన్నేళ్ల క్రితం తారకరత్న ఆర్థికంగా ఇబ్బందులు పడిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తన వంతు సహాయం చేశారని సమాచారం అందుతోంది. తారకరత్న భార్య తన పిల్లలను ప్రయోజకులను చేయాలని వాళ్లు ఉన్నత స్థానాలకు ఎదిగేలా చూడాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. కెరీర్ విషయంలో అలేఖ్యారెడ్డి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తారకరత్న వ్యాపారాలకు సంబంధించిన బాధ్యతలను అలేఖ్య చూసుకుంటున్నారని సమాచారం.


రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus