Alekhya Reddy: భర్తను తలుచుకొని ఎమోషనల్ అయిన అలేఖ్య రెడ్డి!

నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తారకరత్న పలు సినిమాలలో నటించిన ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి అయితే ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయినా ఈయన తన తాతయ్య స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ రాజకీయాలలో సక్సెస్ సాధించాలని భావించారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో భాగంగా ఈయన పాల్గొని తనకు మద్దతు తెలిపారు. అయితే మొదటి రోజు పాదయాత్రలోనే ఈయన స్పృహ తప్పి పడిపోయారు. ఈ విధంగా జనవరి 27వ తేదీ కొన్ని పోటికి గురై దాదాపు 23 రోజులపాటు హాస్పిటల్ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తారకరత్న ఫిబ్రవరి 17వ తేదీ మరణించారు.

ఇలా తారకరత్న మరణించడంతో (Alekhya Reddy) అలేఖ్య రెడ్డి ఎంతో దుఃఖ సాగరంలో మునిగిపోయారు. తారకరత్న మరణించి దాదాపు మూడు నెలలు అవుతున్న ఇంకా తన భర్త జ్ఞాపకాల నుంచి ఆయన మరణ వార్త నుంచి అలేఖ్య రెడ్డి బయటపడలేదని తెలుస్తోంది. తరచూ తన భర్త గురించి ఎమోషనల్ పోస్టులు చేస్తూ తన భర్త పై ఉన్నటువంటి ప్రేమను బయట పెడుతున్నారు. అయితే తాజాగా అలేఖ్య రెడ్డి మరోసారి తన భర్తని తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా తారకరత్నతో కలిసి దిగినటువంటి ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ జన్మకు నా జీవితం ఇంతేనని తారకరత్న తనలోకమని తెలియజేశారు. తారకరత్న జ్ఞాపకాలతో ఈ జీవితం మొత్తం గడుపుతానని తన శ్వాస ఉన్నంత వరకుకూడా తారకరత్నను ప్రేమిస్తూ ఉంటానని అలేఖ్యరెడ్డి తన భర్త పై ఉన్నటువంటి ప్రేమను మరోసారి బయటపెడుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే.


ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus