Alekhya Reddy: పిల్లలపై ద్వేషాన్ని చూపించకండి.. అలేఖ్య కామెంట్స్ వైరల్!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నెగిటివిటీ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. భావ ప్రకటన స్వేచ్చ అంటూ చాలామంది ఇతరులను హర్ట్ చేసే విధంగా కామెంట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. తారకరత్న (Taraka Ratna)  భార్య అలేఖ్యారెడ్డి (Alekhya Reddy) సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. ఆమె సోషల్ మీడియాలో సైతం ఎవరినీ ఇబ్బందికి గురి చేసే విధంగా కామెంట్లు పెట్టరనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా అలేఖ్యారెడ్డి తన కుటుంబానికి సంబంధించిన పోస్టులను ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటారు.

Alekhya Reddy

అలేఖ్యారెడ్డి పిల్లల గురించి ఒక నెటిజన్ నెగిటివ్ కామెంట్ చేయగా ఆ కామెంట్ గురించి ఆమె రియాక్ట్ అయ్యారు. ఇంతమంది పిల్లల్ని కనడం ఎందుకంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా ఆ కామెంట్ గురించి అలేఖ్య రియాక్ట్ కావడం జరిగింది. అలేఖ్య తన ఇన్ స్టాగ్రామ్ స్టొరీలో ఎవరి పిల్లలైనా వాళ్ల స్థాయిని బ్యాగ్రౌండ్ ను చూడకుండా అందరినీ సమానంగా చూడాలని ప్రేమించాలని పేర్కొన్నారు. పిల్లలపై ద్వేషాన్ని చూపించకూడదని ప్రేమను పంచాలని చెప్పుకొచ్చారు.

పిల్లలకు హాని చేయాలని కోరుకోకూడదని ఆమె అన్నారు. ప్రస్తుత సమాజంలో ప్రేమను పంచే తత్వం, అర్థం చేసుకునే గుణం పెంచాలే తప్ప నెగిటివిటీ, ద్వేషం పెంచకూడదని ఆమె తెలిపారు. దయచేసి ప్రేమను పంచాలని మనం పాజిటివ్ గా ఆలోచిస్తే మాత్రమే అలాంటి సమాజాన్ని నిర్మించొచ్చని అలేఖ్య పేర్కొన్నారు. అలేఖ్య వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

అలేఖ్యారెడ్డి (Alekhya Reddy) చేసిన కామెంట్లను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అలేఖ్యారెడ్డి కెరీర్ పరంగా ఎంతో ఎదగాలని తన పిల్లలను ప్రయోజకులను చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలేఖ్య కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఆమె కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ ఉంటుంది. బాలయ్య అలేఖ్యారెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.

 ‘సత్యం సుందరం’ 11 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Alekhya ReddyNandamuri Taraka Ratna

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus