టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజే సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చీ వారం మన ముందుకు వచ్చేందుకు తంగా సిద్దం చేసుకుంటుంది. అయితే అదే క్రమంలో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్న మాట పక్కన పెడితే, ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ ఈ సినిమాకి కొన్ని చిక్కులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి…ఇంతకీ ఏమా చిక్కులు అని అంటే ఒక్కసారి ఈ కధ చదవండి…మ్యాటర్ లోకి వెళితే, మన స్టైలిష్ స్టార్ సినిమాకి ఉన్న సమస్యల్లో మొదటిది ప్రస్తుతం ప్రధానంగా దేశంలో హాట్ టాపిక్ గా మారిన జిఎస్‌టి. అసలు జిఎస్‌టి కి డీజె కి ఏంటి సంభంధం అంటే…అక్కడే ఉంది అసలు మ్యాటర్…జిఎస్‌టి విధానాన్ని సినిమా పరిశ్రమపై కూడా ప్రయోగించనుంది ప్రభుత్వం. ఇప్పటికే టాక్స్ ల రూపంలో భారీ చిత్రాలకు పన్నులు విధిస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణయంతో టికెట్ల విషయంలో మరింత ఆదాయాన్ని సమకూర్చనుంది. ఈ లేటెస్ట్ నిర్ణయంవల్ల మొట్టమొదటి దెబ్బ ‘దువ్వాడ’ కు తగలబోతోంది అని అంటున్నారు. ఈ విధానంలో 100 రూపాయల టికెట్లకు 28 శాతం ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది.
అంతకన్నా తక్కువ ఉన్న 18 శాతం వరకు ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. దీనితో ‘డిజే’ కి వచ్చే కలక్షన్స్ లో కొంత భాగం భారీగా ట్యాక్స్ లోకి వెళ్ళిపోతుంది. దీనితో ‘దువ్వడ’ ను భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు హడాలిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘దువ్వాడ’ టాక్ లో తేడా వస్తే ఈ మూవీకి వచ్చే కలక్షన్స్ లో చాలా వరకు టాక్స్‌లకే పోతుందని బయ్యర్లు ఖంగారు పడుతున్నట్లు టాక్. ఇక మరో పక్క డీజె రిలీజ్ రోజునే…దేశ వ్యాప్తంగా సల్మాన్ ఖాన్ మూవీ ‘ట్యూబ్ లైట్’ సైతం విడుదల అవుతూ ఉండడం….ఇక ఆ సినిమా ప్రభావం సైతం బన్నీ సినిమా కలక్షన్స్ పై ఉండబోతున్నాయి ఎలా అంటే… సల్మాన్ ఖాన్ సినిమాలకు ప్రధాన పట్టణాలలో విపరీతమైన కలక్షన్స్ ఉంటాయి. ఈ నేపధ్యంలో మల్టీ ప్లేక్స్ స్క్రీన్స్ భారీ స్థాయిలో మన డీజెకి దొరకడం, ఒకవేళ దొరికినా కలెక్షన్స్ పెద్దగా ఆశించలేం అనే చెప్పాలి…మొత్తంగా చూసుకుంటే ఈ రెండు చిక్కుల్లో ఇరుక్కున డీజె…ఎలా గట్టెక్కుతాడో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.