అమర్ అక్బర్ ఆంటోనీ కోసం ట్యాక్సీవాలాను వాయిదా వేశారు

మాస్ మహారాజ్ రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా “అమర్ అక్బర్ అంటోనీ”. “దుబాయ్ శీను” తరువాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 16 న రిలీజ్ కానుంది. అయితే అదే రోజు విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ సినిమా అయిన “టాక్సీ వాలా”ని కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ విజయ్ దేవరకొండ కి రవితేజ అంటే చాలా అభిమానం అంట. అందుకే తన “టాక్సీ వాలా” సినిమాని ఒక్క రోజు వాయిదా వేసి నవంబర్ 17 న రిలీజ్ చేస్తున్నాడు విజయ్.

రాహుల్ సంక్రిత్యన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ వారు కలిసి ప్రొడ్యూస్ చేసారు. మరి ఈ బాక్స్ ఆఫీస్ పోరు లో ఒక్క రోజు లేట్ గా వస్తున్న విజయ్ గెలుస్తాడా లేకపోతే ఒక్క రోజు ముందుగా వస్తున్న రవితేజ గెలుస్తాడో వేచి చూడాలి. ఇకపోతే.. ఈ ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉన్నా, నిర్మాతలు మాత్రం జరుగుతున్నా బిజినెస్ తో సంతోషంగానే ఉన్నారు. ఈ ఇద్దరు హీరోల మునుపటి చిత్రాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా సినిమాలు మంచి రేట్ కే అమ్ముడుపోయాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus