ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తున్న “టాక్సీ వాలా” ప్రీ రిలీజ్ బిజినెస్.!

పెళ్లి చూపులు సినిమాతో కూల్ హిట్  కొట్టిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దీంతో అవకాశాలు వెల్లువెత్తాయి. ఏకంగా ఐదు సినిమాలకు సైన్ చేశారు. వాటిలో మహానటి ముందుగా రిలీజ్ అవుతోంది. అందులో చిన్న పాత్రే అయినా మంచి గుర్తింపును తీసుకొస్తుందని సమాచారం. ఇక పోతే హీరోగా నటించిన టాక్సీ వాలా  మే 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది. యువ దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టిజర్ సినిమాపై అంచనాలను పెంచాయి.

విజయ్ క్రేజ్.. ఈ పెరిగిన అంచనాలు కలిసి ప్రీ రిలీజ్ బిజినెస్ దుమ్ములేపాయి. ఫస్ట్ కాపీ రెడీకాకముందే.. కనీసం ట్రైలర్ కూడా సిద్ధం కాకముందే డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడి సినిమాని కొనుగోలు చేశారు. భారీ ధరకు శాటిలైట్, డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్టు తెలిసింది. ధరని చెప్పడానికి ఇష్టపడని ట్రేడ్ వర్గాల వారు.. ఈ రైట్స్ తోనే సినిమాకి బ్రేక్ ఈవెన్ వచ్చిందని వెల్లడించారు. ఇప్పటికే నిర్మాతలకు లాభాలు వచ్చాయని టాక్. ఇక విజయ్ దేవరకొండ ఈ సినిమాకి రెమ్యునరేషన్ గా ఓవర్సీస్ రైట్స్ తీసుకున్నాడని సమాచారం. తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో బాగానే కలక్షన్స్ రాబడుతున్నాయి. సులువుగా రెండు మిలియన్ డాలర్లను క్రాస్ చేస్తున్నాయి. సో విజయ్ ఈ సినిమాతో గట్టిగానే ఆర్జించేటట్టు ఉన్నారని ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus