Rajinikanth: అచ్చం రజినీకాంత్ ను పోలిన వ్యక్తి…చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఈ ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు ఉంటారు అనే సంగతి మనకు తెలిసింది. ఇలా అప్పుడప్పుడు మనకు ఇలా ఓకే పోలికలతో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు తారాస పడుతూ ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీల మాదిరిగానే వారి పోలికలతో ఉన్నటువంటి వారిని మనం ఈ మధ్యకాలంలో తరచూ చూస్తూనే ఉన్నాము. సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఇలాంటి వారి ఫోటోలు ఎక్కడ కనిపించినా వెంటనే వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే రజనీకాంత్ కి సంబంధించినటువంటి ఒక ఫోటో వైరల్ గా మారింది

అయితే ఇక్కడ రజనీకాంత్ అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. అచ్చం రజనీకాంత్ పోలికలతో ఉన్నటువంటి వ్యక్తి రోడ్డుపై చాయ్ అమ్ముతూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆ వ్యక్తి ఫోటో చూసి షాక్ అవుతున్నారు. ఇటీవల మలయాళం డైరెక్టర్ నాదిర్ షా పోర్ట్ కొచ్చిన్ కి వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి రోడ్డు మీద ఛాయ్ అమ్ముతూ అచ్చం రజినీకాంత్ లాగే కనపడ్డాడు.

దీంతో నాదిర్ షా ఆశ్చర్యపోయాడు. తెల్ల గడ్డం, బట్టతల, కళ్ళజోడు పెట్టుకొని దూరం నుంచి చూస్తే అచ్చు రజనీకాంత్ ని తలపించడంతో ఆయన తనతో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను డైరెక్టర్ నాదిర్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.

ఇక ఈ ఫోటోలో చూసిన వారందరూ కూడా అచ్చం రజనీకాంత్ పోలికలతోనే ఉన్నారు అంటూ ఆశ్చర్యపోవడమే కాకుండా ఆయనను కలవడం కోసం చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఇలా రజనీకాంత్ పోలికలతో ఉన్నటువంటి ఈయనకు (Rajinikanth) రజనీకాంత్ పోలికలు ఏ విధంగా అయినా సహాయం చేస్తాయో చూడాలి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus