‘ఒక్కడు’ వలనే ‘నిజం’ ప్లాపయింది.. అందుకే మహేష్ తో ఇలా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు విలక్షణ దర్శకుడు తేజ డైరెక్షన్లో ‘నిజం’ అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. 2003 మే నెలలో విడుదలైన ఈ చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. మంచి మెసేజ్ తో తేజ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మహేష్ నటన కి కూడా మంచి మార్కులు పడ్డాయి. కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. దీంతో మహేష్,తేజ లకు మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయని… దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందని ప్రచారం జరిగింది.

ఈ విషయం పై తేజ.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తేజ మాట్లాడుతూ.. ” ‘నిజం’ చాలా మంచి సినిమా. మహేష్ బాబు ‘ఒక్కడు’ సినిమా ఎఫెక్ట్ ‘నిజం’ పై పడడం వల్ల ప్లాపయ్యింది. ‘నిజం’ కంటే ముందుగా ‘ఒక్కడు’ విడుదలైంది. ఈ చిత్రంతో మహేష్ బాబు ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ‘ఒక్కడు’ చిత్రంలో మహేష్ ని చూసిన తర్వాత ‘నిజం’ చిత్రంలో ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు.

ఇక ‘నిజం’ ప్లాపవ్వడం వల్ల నాకు, మహేష్ కు గొడవలు జరిగాయని ఏవేవో వార్తలు వచ్చాయి. వాస్తవానికి మహేష్ కు, నాకు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు” అంటూ క్లారిటీ ఇచ్చాడు తేజ.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus