కాజల్ కి మంచి రోల్ సృష్టించిన తేజ!

ల‌క్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా కాజల్ అగర్వాల్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ యువరాణి గా పేరు దక్కించుంది. ప్రస్తుతం దక్షిణాది టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. తనకు హీరోయిన్ గా లైఫ్ ఇచ్చిన తేజ అడిగిన వెంటనే “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. తేజ ని హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. అదే అభిమానంతో కాజల్ కి తేజ ఒక పవర్ ఫుల్ రోల్ సృష్టించినట్టు తెలిసింది. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ నుంచి బయటికి వచ్చిన తర్వాత వేగంగా మరో కథని కంప్లీట్ చేశారు. బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా నటించనున్న ఈ సినిమాకి రెండు రోజుల క్రితం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో అనిల్ సుంక‌ర నిర్మిస్తున్న సినిమాలో కాజల్ హీరోయిన్ అయినప్పటికీ అందాల ఆరబోతకే పరిమితం కాదని తెలిసింది. హీరోకన్నా ఎక్కువ సీన్స్ కాజల్ కే ఉందని సమాచారం. బహుశా ఈ మూవీకి కాజల్ పోషించే రోల్ పేరునే టైటిల్ గా పెట్టనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఈ చిత్రంలో సోనూసూద్  విల‌న్‌గా న‌టిస్తున్నాడు. అతనితో కాజల్ పోటీపడే సన్నివేశాలు కొత్తగా ఉంటాయని టాక్. దీంతో రెగ్యులర్ షూటింగ్ కి కూడా వెళ్లకముందే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus