ఆయన వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయన్ను పలకరించిన ప్రొడ్యూసర్ ఒక్కడూ లేడు. ఆయన్ని తమ సినిమాల వేడుకలకు ఇన్వైట్ చేయడానికి సంకోచించారు. అలాంటిది నేడు ఆయన చుట్టూ “మాకో సినిమా చేసి పెట్టండి” అంటూ తిరుగుతున్నారు. అడ్వాన్స్ లు ఇవ్వడానికి లక్షల రూపాయలు సూట్ కేసులు పట్టుకొని ఆయన ఆఫీస్ డోర్ ముందు క్యూ కట్టారు. అయితే.. తనను ముందు పొగిడి, వెనుక తిట్టుకొన్నవారిని పొరపాటున కూడా నమ్మనని.. ముఖ్యంగా రాజకీయ నాయకుల కంటే దారుణంగా వారానికి ఒక పార్టీ మార్చే నిర్మాతలను అస్సలను నమ్మేది లేదని తేల్చి చెప్పేశాడాయన. ఆయనే దర్శక దిగ్గజం తేజ.
పద్నాలుగేళ్ల తర్వాత “నేనే రాజు నేనే మంత్రి”తో డీసెంట్ హిట్ అందుకొన్న తేజ చుట్టూ నిర్మాతలు తెగ తిరుగుతున్నారట. తనకి సక్సెస్ లు లేనప్పుడు పట్టించుకోని నిర్మాతలను తాను ఇప్పుడు ఎందుకు పట్టించుకోవాలి. తన కెరీర్ ట్రాక్ రికార్డ్ ను కాక టాలెంట్ ను గుర్తించి తనకు అవకాశమిచ్చిన సురేష్ బాబుకు తాను ఎప్పటికీ ఋణపడి ఉంటానని, అందుకే తన తదుపరి చిత్రం కూడా సురేష్ ప్రొడక్షన్ లోనే చేస్తానని, ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టానని త్వరలోనే సురేష్ బాబుకి నేరేట్ చేసి.. ఆయనకు నచ్చితే సెట్స్ మీదకు వెళ్లడమేనని తేజ పేర్కొన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.