Teja Sajja: తేజకి అప్పుడే సీనియారిటీ వచ్చేసింది చూశారా!

తేజ సజ్జా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అందరికీ తెలుసు… ఈ మధ్య హీరోగా మారి అదరగొట్టాడు కూడా. అయితే అతన్ని ఆటపట్టించడానికి ‘నువ్వు ఇంకా చైల్డ్‌ ఆర్టిస్ట్‌’ అనుకుంటున్నావా? అని అంటుంటారు కూడా. ఆఖరికి ఈ రోజు ఓటీటీలో విడుదలైన ‘అద్భుతం’ సినిమాలో కూడా ఇలాంటి డైలాగ్‌ వాడేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిస్క్‌ గురించి చెప్పాడు తేజ. ఆ మాటలు వింటుంటే… భలే సీనియారిటీ వచ్చేసిందే అనిపిస్తోంది. ఇంకా చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఏ మాత్రం కాదు అనొచ్చు.

నా దృష్టిలో రిస్క్‌ చేయకపోవడమే అతి పెద్ద రిస్క్‌ అంటున్నాడు తేజ. కొత్త హీరోల చిత్రాలకు ప్రేక్షకులు రావాలంటే కథలో ఆకర్షణీయమైన అంశంతోపాటు కొత్త విషయం కూడా ఉండాలి అని చెబుతున్నాడు తేజ. కాబట్టి ప్రతి సినిమాకీ ఓ కొత్త కథతో ప్రయోగం చేయాల్సిందే. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రయోగాలు ఊహించనంత విజయాల్ని అందిస్తాయి. ఒక్కోసారి ఇబ్బందికర ఫలితాలు ఎదురవుతాయి అని చెప్పాడు తేజ. రిస్క్‌ గురించి మాట్లాడుకుంటే మన హీరోలు చాలా రోజుల నుండి తీసుకుంటూనే ఉన్నారు.

సినిమా కథల ఎంపిక నుండి, సినిమాల్లో చేసే స్టంట్లు, డ్యాన్స్‌ల వరకు అన్నింటా రిస్క్‌ తీసుకుంటున్నారు. అందుకే ఎప్పటికప్పుడు అభిమానుల్ని అలరిస్తూ ఉన్నారు. ఇప్పుడు తేజ కూడా ఇదే మాట అంటున్నాడు. యూత్‌ హీరోలు ఇలా చేయడం టాలీవుడ్‌కి చాలామంచి చేస్తుంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus