తేజ సజ్జా.. అందరికీ సుపరిచితమే. బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి… దాదాపు 20 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇక ఫుల్ లెంగ్త్ హీరోగా మారి ‘జాంబీ రెడ్డి’ ‘ఇష్క్’ ‘అద్భుతం’ వంటి సినిమాలు చేశాడు. ఇప్పుడు ‘హను-మాన్’ అనే పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా టీజర్, పాటలు.. ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. ఈరోజు ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. అది కూడా సూపర్ రెస్పాన్స్ ను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమా పై ఉన్న అంచనాలను పది రెట్లు పెంచింది అని చెప్పొచ్చు.
ఇక ‘హను -మాన్’ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13 న రిలీజ్ కాబోతుంది. ఇక ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేస్తూ.. ట్రైలర్ లాంచ్లోనే ‘క్యూ అండ్ ఎ సెషన్’..ను కూడా నిర్వహించింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హీరో తేజ సజ్జా ఇచ్చిన సమాధానం బాగా హైలెట్ అయ్యింది. ఇంతకీ ఆ రిపోర్టర్ తేజ సజ్జాని అడిగిన ప్రశ్న ఏంటంటే ..’ ‘హను – మాన్’ సినిమా మీ స్థాయికి మించిన కాన్వాస్ ఉన్న సినిమాలా అనిపిస్తోంది’ అనేది అతని ప్రశ్న.
దీనికి తేజ సజ్జా సమాధానం ఇస్తూ.. “ఎవరైనా సెకండ్ జనరేషన్ యాక్టర్స్(వాళ్ళ వారసులు) వస్తే ఇంతకంటే పెద్ద సినిమాలు చేస్తుంటే వాళ్ళని మీరు ఏమీ అడగరు. నేను చిన్నపటి నుండి సినిమాలు చేస్తూ.. కష్టపడి కొంత ఇమేజ్ సంపాదించుకుని ఇలాంటి సినిమా చేస్తే మాత్రం నన్ను ‘చిన్న చూపు’ చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది” అంటూ జవాబిచ్చాడు. తేజ సజ్జా నిజంగానే మంచి సమాధానం ఇచ్చాడు. అతని ఆవేదన కూడా కరెక్టే..!
సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలు వచ్చి ఇలాంటి సినిమాలు చేస్తుంటే వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు ఎదురవ్వడం లేదు. వాస్తవానికి.. ఓ హీరో ఇమేజ్ ను డిసైడ్ చేసేది స్ట్రాంగ్ కంటెంట్. అలాంటి కంటెంట్ ను నమ్ముకుని సినిమాలు చేస్తే స్టార్ ఇమేజ్ వారిని వెతుక్కుంటూ వస్తుంది. ‘యష్’ అంటే ‘కె.జి.ఎఫ్’ కి ముందు ఎంతమందికి తెలుసు? ఆ సినిమా కంటెంట్ అతన్ని పెద్ద స్టార్ ను చేసింది. పోనీ ఇది పక్కన పెట్టినా..
దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా తన స్పీచ్ లో ‘మేమంతా చిన్నవాళ్ళం. అయినా సరే పెద్ద ఎఫర్ట్ పెట్టి .. ఓ పెద్ద సినిమా చేశాం.. అది కూడా తక్కువ బడ్జెట్లో ‘ అని క్లియర్ గా చెప్పాడు. అయినా సరే తేజ సజ్జాని అతని ఇమేజ్ ను తక్కువ చేసి ఇలా ప్రశ్నించడం అనేది చాలా తప్పు అనే చెప్పాలి. ఇదే టైంలో (Teja Sajja) తేజ సజ్జా మెచ్యూరిటీ కూడా అందరికీ తెలిసొచ్చింది.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!