Mirai: మార్కెట్ లో సైలెంట్.. బిజినెస్ మాత్రం గట్టిగానే!

పాన్ ఇండియా సినిమాల జాబితాలో లేటెస్ట్ గా చేరిన మూవీ ‘మిరాయ్’ (Mirai) . తేజా సజ్జా  (Teja Sajja)  హీరోగా రూపొందుతున్న ఈ సూపర్ యోధ సినిమా టీజర్‌ రాకముందే మార్కెట్‌ వర్గాల్లో భారీ హైప్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం. బుక్ మై షో లో 25 వేల మందికి పైగా ఇంట్రెస్ట్ నమోదు కావడం ఒక పెద్ద హీరో సినిమా కోసం సాధ్యమైనదే కానీ, తేజా లాంటి మధ్య తరహా హీరో సినిమా కోసం ఇదంతా జరుగుతుండటం మాత్రం ఆశ్చర్యమే.

Mirai:

ఇది బిజినెస్ వర్గాల్లో ఈ సినిమాపై ఎంతటి ఆసక్తి నెలకొన్నదీ చెప్పకనే చెబుతోంది. ‘హనుమాన్’ తో  (Hanu-Man)  నేషనల్ స్టార్ గా మారిన తేజా, మిరాయ్‌లో సూపర్ యోధగా కనిపించనున్నాడు. అతను ఎంచుకుంటున్న కథల లైన్ చూసి ట్రేడ్ వర్గాలు ఈ సినిమాను ఒక కమర్షియల్ వీరుడు చూపించబోతున్నాడని భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు నైజాం, ఆంధ్రా, సీడెడ్ లో సాలీడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందని సమాచారం. దాదాపు 25 కోట్లకు పైనే డీల్స్ సెట్ అయినట్లు టాక్ వస్తోంది.

ఈ ఫిగర్ ఏదైనా స్టార్ కిడ్స్ సినిమా అయితే సులభంగా సాధించదగినది. కానీ తేజా వంటి సెల్ఫ్ మేడ్ హీరో సినిమా అందుకోవడం రేర్ అండ్ రిఫ్రెషింగ్. ఇంకా ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా హక్కుల కోసం కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. బాలీవుడ్ మార్కెట్‌ ఈసారి ‘మిరాయ్’ కోసం ఓపెన్‌గా ఎదురుచూస్తోంది.

ఇది హనుమాన్ క్రేజ్ వల్ల వచ్చిన అటెన్షనే అయినా, మిరాయ్ టీజర్ విడుదలైతే అదే హైప్ వేరే లెవెల్‌కు వెళ్లే అవకాశముంది. చిన్న హీరో సినిమా అనుకున్నా, స్కేల్, కంటెంట్ పరంగా పెద్ద సినిమాలకు దీటుగా ఉండేలా అన్ని వివరాలు లీక్ అవుతున్నాయి. ఇప్పటికి టీజర్ రిలీజ్ కాకుండానే తేజా మార్కెట్‌లో తన స్థాయిని పెంచుకున్నాడు. కథనాల ప్రకారం, ఈ సినిమా మోషన్ పోస్టర్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కి ఇప్పటికే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా ఏర్పడింది. మరి టీజర్‌ వచ్చిన తర్వాత మిరాయ్ వసూళ్లు, బిజినెస్ దూకుడు ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus