Bigg Boss Telugu OTT: బూతులు మాట్లాడిన శివ, తేజస్వి ఫైర్..! అసలు ఏం జరిగిందో తెలుసా..!

బిగ్ బాస్ హౌస్ లో స్మగ్లర్స్ అండ్ పోలీస్ టాస్క్ నడుస్తోంది. ఇక్కడే పోలీసులు పెట్టిన చెక్ పోస్ట్ దాటేందుకు నానా కష్టాలు పడుతున్నారు స్మగ్లర్స్. ముఖ్యంగా జూనియర్స్ టీమ్ లో కానిస్టేబుల్స్ గా మారిన శివ, ఇంకా చైతూ ఇద్దరూ సీనియర్స్ తో ఆట ఆడుకుంటున్నారు. ఫస్ట్ రెండు రౌండ్స్ లో వారియర్స్ టీమ్ గెలిచినా కూడా జూనియర్స్ వాళ్లకి చుక్కలు చూపించారు. ఇక్కడే తేజస్వికి ఇంకా శివకి సిగరెట్ ప్యాకెట్ కోసం పెద్ద యుద్ధమే జరిగింది.

Click Here To Watch Now

ఫస్ట్ కానిస్టేబుల్ గా ఉన్న యాంకర్ శివ బట్టల్లో నుంచీ తేజస్వి అండ్ టీమ్ బొమ్మలని తీసే ప్రయత్నం చేసింది. అప్పుడు యాంకర్ శివ నా పర్సనల్ బట్టలు ఎందుకు ముట్టుకున్నారు అంటూ మాట్లాడాడు. ఆ తర్వాత తేజస్వి డ్రెస్ లో ఉన్న సిగరెట్ ప్యాకెట్ శివ చేతికి చిక్కింది. దీంతో అతను దాన్ని దాచి పెట్టాడు. అంతేకాదు, ఆ సిగరెట్ ప్యాకెట్ లో సిగరెట్ కూడా కాల్చాడు. ఇక్కడే తేజస్వి తన ప్యాకెట్ ఎందుకు తీశావో చెప్పు అంటూ మాట్లాడింది.

నేను తీయలేదు అంటూ శివ ఎదురుదాడి చేశాడు. ఇద్దరూ చాలాసేపు ఆర్గ్యూమెంట్ చేస్కున్నారు. నీ బట్టలు ముట్టుకుంటే నీకు కోపం వచ్చింది, మరి నా పర్సనల్ అయిన సిగరెట్ ప్యాకెట్ ఎందుకు తీస్కున్నావ్ అంటూ తేజస్వి గోల గోల చేసింది. ఇక్కడే బిందుమాధవి యాంకర్ శివ తరపున మాట్లాడింది. బిగ్ బాస్ పంపించిన సిగరెట్ ప్యాకెట్ అని, అది అందరికీ ఉద్దేశ్యించి ఉంటుంది కానీ, పర్సనల్ ఎలా అవుతుంది అంటూ ప్రశ్నిచింది.

అంతేకాదు, అక్కడే ఉన్న జూనియర్స్ సైతం శివకి సపోర్ట్ గా నిలిచారు. దీంతో తేజస్వి చాలాసేపు ఆర్గ్యూమెంట్ చేసింది. లాస్ట్ కి తన సిగరెట్ ప్యాకెట్ దొరికే సరికి గొడవ సద్దుమణిగింది. దీంతో బాగా హర్ట్ అయిన శివ కెమెరా ముందుకు వచ్చి బిగ్ బాస్ ని రిక్వస్ట్ చేశాడు. నా పేరు పైన ప్యాకెట్ పంపించమని అంతేకానీ ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పాడు. అంతేకాదు, ఇక్కడే నోరుజారి బూతుపదం కూడా మాట్లాడాడు. వెంటనే సారీ అంటూ సారీ చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus