అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులకు గుడ్ న్యూస్. అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సంధ్య థియేటర్ ఘటనలో కొన్ని గంటల ముందు అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అతన్ని గాంధీ హాస్పిటల్..కి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. అటు తర్వాత కోర్టుకి విచారణ కొరకు తీసుకెళ్లడం జరిగింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ‘తనపై నమోదైన కేసును కొట్టేయాలని క్వాష్ పిటిషన్’ అల్లు అర్జున్ దాఖలు చేయడం జరిగింది.
అయితే దానిని నాంపల్లి హైకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా 14 రోజుల పాటు అల్లు అర్జున్ ని రిమాండ్ లో ఉంచాలని స్టే ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్..ను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. అయితే మరోపక్క సంధ్య థియేటర్ ఘటనలో మరణించిన రేవతి భర్త భాస్కర్.. ‘అల్లు అర్జున్ తప్పేమీ లేదని,నేను ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానని’ ప్రకటించాడు. దీంతో అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు అంగీకరించినట్లు తెలుస్తోంది.
మరికొన్ని గంటల్లో అల్లు అర్జున్ ని రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుండి టాలీవుడ్ పెద్దలంతా అతనికి అండగా నిలబడ్డారు. దిల్ రాజు (Dil Raju), నాగవంశీ (Suryadevara Naga Vamsi), త్రివిక్రమ్ (Trivikram) వంటి వారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అలాగే నాంపల్లి హైకోర్టుకు వెళ్లి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో నాని (Nani) , అడివి శేష్ (Adivi Sesh) వంటి సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ అరెస్ట్..ను వ్యతిరేకిస్తూ ట్వీట్లు వేశారు.