ధన్య బాలకృష్ణ (Dhanya Balakrishna) అందరికీ సుపరిచితమే. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడింది. తమిళ అమ్మాయే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె బాగా దగ్గరైంది. అందుకు ప్రధాన కారణం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమా అని చెప్పాలి. అందులో మహేష్ బాబుకి (Mahesh Babu) ప్రపోజ్ చేసే అమ్మాయిగా ఈమె చేసిన కామెడీ అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఈ మధ్య కాలంలో ధన్య.. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి మంచి పాత్రలు చేస్తుంది.
‘హత్య’ (Hathya) వంటి సినిమాల్లో ఈమె పెర్ఫార్మన్స్ తో బాగా ఆకట్టుకుంది. అయితే ఈమె గొర్రెలు మేపుతున్న వీడియో షేర్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే… ధన్య బాలకృష్ణ కీలక పాత్రలో ‘బాపు’ (Baapu) సినిమా తెరకెక్కింది. ఇందులో బ్రహ్మాజీ (Brahmaji) ప్రధాన పాత్ర పోషించగా ఆమనీ (Aamani), ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి(Sudhakar Reddy), అవసరాల శ్రీనివాస్ (Srinivas Avasarala) కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో ఆమె వయసుడికిన యువతిగా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించింది.
ఆమె హానెస్ట్ పెర్ఫార్మర్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా తన నైపుణ్యాన్ని చాటుకుంది. ఇదిలా ఉండగా.. ‘బాపు’ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో ఆమె గొర్రెలు మేపుతున్న ఒక సరదా వీడియోను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఈ వీడియోని సరైన విధంగా అర్థం చేసుకోకుండా.. ‘సినిమా ప్రమోషన్స్ కోసం ఆఖరికి గొర్రెలు కూడా మేపుతున్నావా?’ అంటూ వింత కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ వీడియో హాట్ టాపిక్ అయ్యింది.