తమిళ ప్రేక్షకులకు ఏ నటుడైనా నచ్చితే.. వాళ్ళ సినిమాలు ఎలా ఉన్నా చూసి .. వాళ్లకు స్టార్ డంని కట్టబెడతారు. తెలుగు ప్రేక్షకులకు హీరోలతో.. సంబంధం ఉండదు. వాళ్లకు సినిమా నచ్చితే దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి పెడతారు. రెండు పరిశ్రమలకు చాలా తేడా ఉంది. అందుకే పక్క రాష్ట్రాల్లోని హీరోలు తమ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ సినిమాల పై మోజు ఎక్కువవుతుంది..
వాళ్ళ సినిమాలపై ఓవర్ హైప్ చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. ఈ ఏడాది… తెలుగు సినిమాలతో సమానంగా రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. ఒరిజినల్ లో ప్లాప్ అయిన సినిమాలు కూడా ఇక్కడ హిట్ అవ్వడంతో ఆ అనుమానాలు రెట్టింపు అవుతున్నాయి. బ్రహ్మాస్త్రం, సూర్య నటించిన ‘ఈటి’, అజిత్ నటించిన ‘వలీమై’ చిత్రాలు ఒరిజినల్లో కంటే తెలుగులోనే బాగా ఆడాయి.
ఓ మోస్తరు టాక్ వస్తే చాలు డబ్బింగ్ సినిమాలు తెలుగులో భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. ‘కాంతార’ సినిమా కామన్ ఆడియన్స్ కు పెద్దగా నచ్చలేదు. కానీ క్రిటిక్స్ మాత్రం ఈ సినిమా ఓ కళాకాండం అన్నట్టు రిలీజ్ కు ముందు నుండే పాజిటివ్ హైప్ ను క్రియేట్ చేశారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక అయితే ఇండస్ట్రీ హిట్ సినిమాలకు కూడా ఇవ్వని రేటింగ్ లు వాటికి ఇచ్చారు. ఇటీవల వచ్చిన ‘లవ్ టుడే’ సినిమాకి కూడా అంతే.
అది యూత్ ఫుల్ మూవీ అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నట్టు చెప్పుకొచ్చారు.ఈ సినిమా ‘కాంతార’ ని మించి కలెక్ట్ చేస్తుంది అని హైప్ ఇచ్చారు. కానీ అంతలా అయితే కలెక్ట్ చేయలేదు కానీ.. ఇది కూడా బిజినెస్ కు డబుల్ ప్రాఫిట్స్ ను అయితే అందించింది. వీటి రిజల్ట్స్ ఎలా ఉన్నా.. తెలుగు ప్రేక్షకులు మిడ్ రేంజ్ తెలుగు సినిమాలను కూడా పక్కన పెట్టేసి డబ్బింగ్ సినిమాల పై మోజు పెంచుకుంటున్నారు అని స్పష్టమవుతుంది.