కంటెంట్ నచ్చితే… భాషాబేధం లేకుండా విజయం అందించడం తెలుగు ప్రేక్షకులకి అలవాటు. కానీ మిగతా భాషల్లోని జనాలు అలా లేనట్టే కనిపిస్తుంది. ఒకప్పుడు తెలుగు సినిమాని చిన్న చూపు చూసింది బాలీవుడ్. కానీ ఇప్పుడు తెలుగు సినిమాని ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంది వాళ్ళే. కొన్నాళ్ళుగా చూసుకుంటే… యావరేజ్ కంటెంట్ ఉన్న తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్లో భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన ‘సాహో’ తెలుగులో డిజాస్టర్ అయ్యింది.
కానీ నార్త్ లో సూపర్ హిట్ అయ్యింది. అక్కడ సోలోగా రూ.150 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ‘కార్తికేయ 2’ ‘పుష్ప ‘ ‘పుష్ప 2’ ఇవన్నీ తెలుగులో యావరేజ్ సినిమాలే. కానీ నార్త్ ఆడియన్స్ మాత్రం వీటికి బ్రహ్మరథం పట్టారు. కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా మన సినిమాలు బాగానే చూస్తున్నారు.
అయితే తమిళనాడులో మాత్రం మన తెలుగు సినిమాలకు ఆదరణ లభించడం లేదు. రాజమౌళి ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ ‘ఆర్.ఆర్.వార్’ వంటి సినిమాలు బాగానే చూశారు. ‘పుష్ప’ ‘పుష్ప 2’ కూడా పర్వాలేదు ఓపెనింగ్స్ పరంగా పర్వాలేదు అనిపించాయి. కానీ అవి బ్రేక్ ఈవెన్ మార్క్ దగ్గర వరకు వచ్చి ఆగిపోయాయి. మన దర్శకులు తమిళ హీరోలతో సినిమాలు చేసినా.. అక్కడి జనాలు ఆదరించడం లేదు. విజయ్ ‘వరిసు'(వారసుడు) యావరేజ్ మార్క్ వద్ద ఆగిపోయింది.
అంతకు ముందు వంశీ పైడిపల్లి కార్తీతో చేసిన ‘తోజా'(ఊపిరి) కూడా ప్లాప్ అయ్యింది. ధనుష్ తో వెంకీ అట్లూరి చేసిన ‘సార్’, అదే ధనుష్ తో శేఖర్ కమ్ముల చేసిన ‘కుబేర’ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘కల్కి 2898 ad’ మినహా మిగిలిన ఏ సినిమాలు కూడా అక్కడ విజయం సాధించలేదు. మన టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా.. తమిళంలో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.