బిగ్గెస్ట్ మ్యూజికల్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3 ‘ఆహా’ లో జూన్ 14న గ్రాండ్ లాంచ్

Ad not loaded.

ఇండియన్ బిగ్గెస్ట్ మ్యూజికల్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3 ప్రేక్షకులని అద్భుతంగా అలరించడానికి సిద్ధమైయింది. మోస్ట్ పాపులర్ ఓటీటీ ‘ఆహా’లో జూన్ 14న గ్రాండ్ గా లాంచ్ అవుతోంది.

సెన్సేషనల్ కంపోజర్ ఎస్ ఎస్ తమన్, స్టార్ సింగర్స్, కార్తిక్, గీతా మాధురి జడ్జస్ గా వ్యహరించే ఈ మ్యూజికల్ ఎక్సట్రావగంజా షో కోసం ఇప్పటికే ఆడియన్స్ పూర్తయ్యాయి.

ఇండియన్ ఐడల్ శ్రీరామ చంద్ర హోస్ట్ చేస్తున్న ఈ మ్యాసీవ్ మ్యూజికల్ కాంపిటేషన్ షోలో ట్యాలెంటెడ్ కంటెస్టెంట్స్ తమ మెస్మరైజింగ్ వోకల్స్ తో ఆడియన్స్ ని అలరించబోతున్నారు.

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3 ప్రోమోగా తాజాగా రిలీజ్ అయ్యింది. శ్రీరామ చంద్ర వైబ్రెంట్ ఎంట్రీతో మొదలైన ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంది.

ప్రోమోలో జడ్జస్ గా కనిపించిన ఎస్ ఎస్ తమన్, స్టార్ సింగర్స్, కార్తిక్, గీతా మాధురి ప్రజెన్స్ మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తమన్ మరోసారి తన సెన్సాఫ్ హ్యుమర్ తో నవ్వులు పూయించారు.

ప్రోమో చూస్తుంటే.. ఈసారి మ్యూజికల్ సెలబ్రేషన్ నెక్స్ట్ లెవల్ లో వుండబోతుందని అర్ధమౌతోంది. ప్రోమో గ్లింప్స్ లో కంటెస్టెంట్స్ వినిపించిన కొన్ని పాటలు ఎక్సయిమెంట్ ని పెంచేశాయి. మొత్తానికి ఈ ప్రోమో సీజన్ 3 పై వున్న క్యురియాసిటీని మరింతగా పెంచింది.

ప్రేక్షలులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ షో ‘ఆహా’లో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus