“తెలుగు చలన చిత్రాల పెరిగిన నిర్మాణ వ్యయము దృష్టిలో పెట్టుకొని మరియు నిర్మాత శ్రేయస్సు కోరి తెలుగు సినిమాని కాపాడుకుందాం అనే లక్ష్యంతో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ది: 08-12-2017 తేదీన న జరిగిన అత్యవసర మీటింగులో, “సంక్రాంతి, దసరా పండుగలకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది”. ఈ విషయమై, ప్రముఖ నిర్మాత మరియు ఛాంబర్ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీ దిల్ రాజు గారు 2019 సంవత్సరంలో మీడియా |
ద్వారా స్ట్రెయిట్ సినిమాలు ఉండగా డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తాం అని ఘాటుగా వ్యాఖ్యలు చేసి ఆ ప్రకారమే స్ట్రెయిట్ సినిమాలకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వాటిని డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయాన్ని విధిగా అమలుపరచాలని తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడుకుంటూ స్ట్రెయిట్ గా తీసిన తెలుగు చిత్రాలకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వాటిని మాత్రమే డబ్బింగ్ సినిమాలకు “సంక్రాంతి, దసరా పండుగలలో” కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సినిమా ఎక్సిబిటర్స్’ ను కోరుచున్నాము”
అంటూ నిన్న తెలుగు నిర్మాతల మండలి ఓ లేఖను విడుదల చేసి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజుకి పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే.. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ వంటి చిత్రాలు 2023 సంక్రాంతికి రిలీజ్ అవుతుంటే.. ‘వారసుడు'(వరిసు ‘తమిళ్’) అనే డబ్బింగ్ సినిమాని 2023 సంక్రాంతి బరిలో.. అది కూడా తెలుగులో వస్తున్న రెండు పెద్ద సినిమాలను కాదని ఈ డబ్బింగ్ సినిమాకి నైజాంలో ఎక్కువ థియేటర్స్ కేటాయించబోతున్నాడు దిల్ రాజు. ‘వీరసింహారెడ్డి’ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలకు ‘మైత్రి’ వారే నిర్మాతలు.
ఇదిలా ఉండగా.. 2019 సంక్రాంతికి రజినీకాంత్ ‘పేట’ సినిమాని పక్కన పెట్టి తన ‘ఎఫ్2’ కి ఎక్కువ థియేటర్లు ఇచ్చుకుంటున్నాడు అంటూ ఓ డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాత…. దిల్ రాజు పై కంప్లైంట్ చేస్తే. ‘సంక్రాంతి అనేది తెలుగు సినిమాకి పెద్ద సీజన్ లాంటిది. ఈ సీజన్ లో డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ థియేటర్స్ ఇవ్వడం కుదరదు. మీడియా కూడా ఇందుకు సహకరించాలి’ అంటూ దిల్ రాజు బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తాను నిర్మిస్తున్నాడు కదా అని ‘వారసుడు’ చిత్రం డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలి అనుకోవడం
పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంటే ఇప్పుడు తెలుగు నిర్మాతల మండలి కూడా ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఓ లేఖను విడుదల చేయడం దిల్ రాజుకి పెద్ద షాకిచ్చినట్టే అని చెప్పాలి. ఇప్పుడు అందరి మైండ్లో మెదులుతున్న ప్రశ్నలు ఒకటే..! ‘ఇప్పుడు దిల్ రాజు తనను తాను ఎలా సమర్ధించుకుంటాడు? ఏ సినిమా వేడుకలో పాల్గొని ఈ విషయంపై స్పందిస్తాడు?’ అనేవి..! ఇప్పుడు ఈ విషయం పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చూద్దాం..!
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!