సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ ‘తెలుసు కదా’ (Telusu Kada). కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా మారి చేసిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. తమన్ సంగీత దర్శకుడు. అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.
మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఓపెనింగ్స్ పై ప్రభావం పడింది. మరీ తీసి పారేసే రేంజ్లో కాకపోయినా పర్వాలేదు అనిపించే రేంజ్లో ఓపెనింగ్స్ వచ్చినా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇవి ఏమాత్రం సరిపోయేలా అయితే లేవు.
ఒకసారి ‘తెలుసు కదా’ 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
2.21 cr
సీడెడ్
0.43 cr
ఆంధ్ర(టోటల్)
1.69 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)
4.33 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.38 cr
ఓవర్సీస్
1.44 cr
టోటల్ వరల్డ్ వైడ్
6.15 కోట్లు(షేర్)
‘తెలుసు కదా’ (Telusu Kada) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.19.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.20 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.6.15 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.11 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.13.85 కోట్ల షేర్ ను రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే చాలా పెద్దగా ఉంది. దీపావళి సెలవులు కూడా అయిపోయాయి. కాబట్టి.. టార్గెట్ రీచ్ అవ్వడానికి చాలా కష్టమే అని చెప్పాలి.