‘డిజె టిల్లు’ ‘టిల్లు స్క్వేర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సాలిడ్ మార్కెట్ ఏర్పరుచుకున్నాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ. అయితే ఆ తర్వాత చేసిన ‘జాక్’ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. నిర్మాత, దర్శకుడు బ్లేమ్ మొత్తం హీరో సిద్ధుపై వేసేశారు. దీంతో బ్యాక్ గ్రౌండ్ లేని సిద్ధు జొన్నలగడ్డ మళ్ళీ డౌన్ అయిపోవడం గ్యారెంటీ అనే కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపించాయి. వినిపిస్తున్నాయి కూడా..!
అయితే సిద్ధు చేతిలో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో ఓ క్రేజీ మూవీ చేస్తున్నాడు. అలాగే నీరజ కోన దర్శకత్వంలో చేసిన ‘తెలుసు కదా’ విడుదలకు సిద్ధంగా ఉంది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 17న దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.
తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ‘మల్లిక గంధ’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యింది. అయినప్పటికీ ఈ సినిమాకు బజ్ అయితే ఏమీ లేదు. టీజర్ కూడా పెద్దగా ఆకట్టుకుంది అంటూ ఏమీ లేదు. అయినప్పటికీ ఈ సినిమాకి క్రేజీ ఓటీటీ డీల్ వచ్చినట్లు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘తెలుసు కదా’ ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.22 కోట్లకు కొనుగోలు చేసిందట. సినిమాకి రూ.45 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. అంటే రిలీజ్ కి ముందే సగానికి సగం రికవరీ అయిపోయినట్టే..!